Begin typing your search above and press return to search.

సెంచరీ కొట్టడానికి సినిమా అంటే క్రికెట్టా?

By:  Tupaki Desk   |   26 Nov 2015 10:30 PM GMT
సెంచరీ కొట్టడానికి సినిమా అంటే క్రికెట్టా?
X
పిల్లల గురించి గవర్నమెంట్ ఒకరు లేక ఇద్దరు చాలు అని యాడ్స్ ఇస్తూ ఉంటుంది. టాలీవుడ్ హీరోలు కూడా ఈ సూత్రాన్ని బాగా వంట బట్టించుకుని ఏడాదికి ఒకటి లేక రెండు మూవీలు చాలు అన్నట్లుగా తీస్తుంటారు. దాదాపుగా హీరోలందరూ ఇలాగే ఉన్నా.. ఒక్క అల్లరి నరేష్ మాత్రం ఈ సిద్ధాంతానికి వ్యతిరేకం.

ఇప్పుడంటే ఓ రెండేళ్ల నుంచి స్పీడ్ తగ్గించి జాగ్రత్త పడాల్సి వచ్చింది కానీ.. ఓ ఏడాది 8, ఓ ఏడాది 7 కూడా మూవీస్ రిలీజ్ చేసేశాడు అల్లరి నరేష్. ఈ స్పీడ్ లో సినిమాలు చేయడం ఇప్పటి తరంలో ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. మొత్తంమీద పధ్నాలుగేళ్ల తన కెరీర్ లో 50 సినిమాల్లో నటించాడు అల్లరి నరేష్. మొదటి సినిమా అల్లరి తరహాలోనే వరుసగా కేరక్టర్స్ వచ్చినా చేశాడు. మధ్యమధ్యలో తనను తను ప్రూవ్ చేసుకునేందుకు గమ్యం లాంటి మూవీస్ చేశాడు. కొత్తగా కనిపిస్తూ లడ్డూబాబు అని కూడా అన్నాడు.

నరేష్ తన కెరీర్ లో ఇప్పటివరకూ 50 మూవీస్ చేయగా.. 68మంది హీరోయిన్లతో నటించాడు. ఇందులో 28మంది కొత్త వాళ్లు కావడం విశేషం. అలాగే 14మంది కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రికార్డ్ ఇతగాడిది. అలాగే సీనియర్ డైరెక్టర్లయిన విశ్వనాథ్ - బాపు - వంశీలతోపాటు క్రియేటర్ గా పేరుపొందిన క్రిష్ణవంశీ డైరెక్షన్ లో కూడా చేశాడు నరేష్. ఈ తరంలో ఈ అవకాశం ఇక ఎవ్వరికీ రాదని స్ట్రాంగ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేయచ్చు. అయితే వంద సినిమాల మార్క్ అందుకుంటారా అంటే మాత్రం.. గ్యారంటీగా సెంచరీ చేయాలని అనుకోవడానికి ఇదేమన్నా క్రికెట్ మ్యాచా ఏంటి అంటూ.. తన స్టైల్ కామెడీ పంచ్ ఇస్తున్నాడు ఈ అల్లరోడు.