Begin typing your search above and press return to search.

మా ఆవిడ నా సినిమాల్లో ఒక్క‌టే చూసింది

By:  Tupaki Desk   |   26 Nov 2015 5:20 AM GMT
మా ఆవిడ నా సినిమాల్లో ఒక్క‌టే చూసింది
X
టాలీవుడ్‌ లో అత్యంత వేగంగా 50 సినిమాల కెరీర్‌ ని పూర్తి చేసుకున్న ఏకైక హీరో అల్ల‌రి న‌రేష్‌. కామెడీ హీరోగా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ ని క్రియేట్ చేసుకుని తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాడు న‌రేష్‌. అయితే ఇటీవ‌లి కాలంలో రొటీన్ మూస పంథా కామెడీ సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పిస్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లొచ్చాయి. రొటీన్ స్లాప్‌ స్టిక్ కామెడీలు న‌చ్చ‌ని జ‌నం నిర్ధ‌య‌గా తిర‌స్క‌రిస్తున్నారు.

కార‌ణం ఏదైనా ప‌రాజ‌యాల్ని రివ్యూ చేసుకుని త‌న‌ని తాను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించుకునేందుకు రెడీ అవుతున్నాన‌ని న‌రేష్ చెబుతున్నాడు. అంతే కాదండోయ్ ఈ యంగ్ బ్యాచిల‌ర్ ఇటీవ‌లే ఓ ఇంటివాడ‌య్యాడు. చెన్న‌య్‌ కి చెందిన విరూప‌ను వివాహ‌మాడాడు. త‌న‌తో సంసార జీవ‌నం గురించి, పెళ్లి త‌ర్వాత జీవితం గురించి చెబుతూ చాలా జోయ్ ఫుల్ అయిపోయాడు.

నేను 50 సినిమాల హీరోని. కానీ మా ఆవిడ నా సినిమాల్లో ఒకే ఒక్క సినిమా చూసింది. అది కూడా పెళ్ల‌యిన త‌ర్వాత రిలీజైన జేమ్స్‌ బాండ్ మూవీని మాత్ర‌మే చూసింది.. అంటూ చెప్పుకొచ్చాడు అల్ల‌రోడు. అయితే అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌ ల కోసం ఎగ‌బ‌డేప్పుడు అది త‌న‌ని ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తుంది. అంతేకాదు.. డూడ్ న‌న్ను ఓ ఫోటోగ్రాఫ‌ర్‌ ని చేసేశావ్‌! అంటూ న‌వ్వేస్తుంది. .. అంటూ త‌న ఉల్లాస‌భ‌రిత‌మైన మ్యారీడ్ లైఫ్ గురించి చెప్పాడు.