Begin typing your search above and press return to search.

మహేష్ 25లో అల్లరి హీరో కూడా

By:  Tupaki Desk   |   21 Jun 2017 8:17 AM GMT
మహేష్ 25లో అల్లరి హీరో కూడా
X
మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న మూవీ స్పైడర్. మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్ హీరోగా వస్తున్న 23వ చిత్రం. ఇంకా ఇదే రిలీజ్ కాలేదు కానీ.. అప్పుడే మహేష్ 25కి సంబంధించిన అప్ డేట్స్ హల్ చల్ చేసేస్తున్నాయి. తన ల్యాండ్ మార్క్ మూవీని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు సూపర్ స్టార్.

మధ్యలో కొరటాల శివతో సినిమా ఉన్నా.. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న 25వ చిత్రం గురించి కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయి. ఈమూవీలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకుంటారని రీసెంట్ గా వార్తలు రాగా.. ఇప్పుడీ సినిమాలో కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. అల్లరి నరేష్ ఈ మూవీలో నటించేందుకు ఇప్పటికే ఒప్పుకున్నాడని.. అది కూడా సపోర్టింగ్ రోల్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడని అంటున్నారు. ఊపిరి లాంటి మూవీతో ఆడియన్స్ ను మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి.. అల్లరి నరేష్ కు ఆఫర్ చేసిన పాత్ర చాలా బాగుటుందట.

ఈ రోల్ నచ్చడంతోనే మహేష్ మూవీలో కేరక్టర్ చేసేందుకు ఒప్పుకున్నాడట అల్లరి నరేష్. ఇప్పటివరకూ ఇద్దరు ముగ్గురు హీరోలు కనిపించే సినిమాల్లో కూడా అల్లరి నరేష్ చేశాడు కానీ.. ఇలా ఓ సపోర్టింగ్ రోల్ చేయడం.. అది కూడా మహేష్ బాబు మూవీలో కావడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/