Begin typing your search above and press return to search.

అల్లరోడి డైరెక్టర్.. అందమైన పోస్టర్

By:  Tupaki Desk   |   26 July 2016 4:11 AM GMT
అల్లరోడి డైరెక్టర్.. అందమైన పోస్టర్
X
అల్లరి నరేష్ ఫ్లాపుల పరంపరలో భాగంగా గత ఏడాది ‘జేమ్స్ బాండ్’ అనే సినిమా ఒకటి వచ్చింది గుర్తుందా..? అల్లరి నరేష్ గత సినిమాలతో పోలిస్తే కొంచెం పర్వాలేదనిపించిన ఈ సినిమాతో సాయికుమార్ మచ్చా అనే యువ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కామెడీని డీల్ చేయడంలో కొంచెం విషయం ఉన్నవాడిలాగే కనిపించాడు కానీ.. తొలి సినిమాతో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. ‘జేమ్స్ బాండ్’ ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ఇప్పుడా దర్శకుడు తన తొలి సినిమాకు భిన్నంగా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా పేరు.. ‘భలే ఉందిరా’.. ‘వీడి లవ్ స్టోరీ అన్నది ట్యాగ్ లైన్.

సినిమా ఎలా ఉంటుందో ఏంటో కానీ.. దీని పోస్టర్ అయితే నిజంగానే ‘భలే ఉందిరా’ అనిపిస్తోంది. ట్యాగ్ లైన్ కూడా బాగుంది. ఈ పోస్టర్ ద్వారా ఇంకేమీ చెప్పలేదు. దీనికి రచన-దర్శకత్వం రెండూ సాయికిషోరే. నిర్మాత ఎవరు.. నటీనటులెవరు అన్నది వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాడట సాయికిషోర్. వైవీఎస్ చౌదరి.. దశరథ్.. శ్రీను వైట్ల లాంటి పెద్ద పెద్ద దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు సాయికిషోర్. చివరగా ‘దూకుడు’ సినిమాకు దర్శకత్వ విభాగంలో పని చేశాడు. ఆ తర్వాత దర్శకుడిగా అరంగేట్రం కోసం ప్రయత్నాలు చేసి ‘జేమ్స్ బాండ్’తో ఆ కల నెరవేర్చుకున్నాడు. ఆ సినిమా సరైన ఫలితాన్నివ్వకపోవడంతో ఈసారి లవ్ స్టోరీ ద్వారా తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తున్న సాయికిషోర్ ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూద్దాం.