Begin typing your search above and press return to search.

అనుష్క సినిమాకు ఇక అడ్డంకులు లేవు

By:  Tupaki Desk   |   15 May 2019 6:54 AM GMT
అనుష్క సినిమాకు ఇక అడ్డంకులు లేవు
X
టాలీవుడ్ లో కొందరు మీడియం రేంజ్ హీరోల కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఇమేజ్ సొంతం చేసుకున్న స్వీటీ అనుష్క గత సంవత్సరం జనవరిలో వచ్చిన భాగమతి తర్వాత ఏ సినిమా చేయలేదు. అది వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కొత్త మూవీ తాలూకు అప్ డేట్స్ ఇవ్వలేదు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోయే సైలెన్స్ మాత్రమే ఒప్పుకున్నా స్వీటీ దాని షూటింగ్ లోనూ పాల్గొనడం లేదు.

కారణం యుఎస్ లో ప్లాన్ చేసిన షెడ్యూల్ కోసం అక్కడికి వెళ్లేందుకు వచ్చిన వీసా అడ్డంకులు. ఇప్పుడివి తొలగిపోయాయి. వీసా అప్లికేషన్ ను అప్రూవ్ చేస్తూ ఇక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతి ఇవ్వడంతో అనుష్క రేపో ఎల్లుండో అమెరికా ఫ్లైట్ ఎక్కనుంది

భారీ బడ్జెట్ తో రూపొందబోయే సైలెన్స్ లో మాధవన్ కీలక పాత్రలో కనిపిస్తాడు. సుబ్బరాజు-షాలిని పాండే-అంజలి-అవసరాల శ్రీనివాస్ లాంటి తెలుగు తారాగణంతో పాటు హాలీవుడ్ స్టార్ కాస్ట్ కూడా పెద్ద సంఖ్యలో ఉండబోతోంది. కోన వెంకట్ తో పాటు టిజి విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించే ఈ మూవీ థ్రిల్లర్ గా రూపొందబోతోందని తెలిసింది.

అనుష్క ఇమేజ్ ని ఇంటర్ నేషనల్ లెవెల్ లో ప్రొజెక్ట్ చేసేలా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని తెలిసింది. విడుదల ఎప్పుడు అనేది ఇంకా ఖరారు కాలేదు. బడ్జెట్ దృష్ట్యా చూస్తే వచ్చే ఏడాది అనుష్కను తెరమీద చూసే ఛాన్స్ దక్కేలా ఉంది. అప్పటి దాకా అభిమానులకు ఎదురు చూపులు తప్పేలా లేదు మరి.