ట్రైలర్ టాక్ః 'ఎలిటా' అదిరిపోయిందిగా

Mon Dec 11 2017 22:32:42 GMT+0530 (IST)

టైటానిక్.. అవతార్.. వంటి సినిమాలను తీసిన జేమ్స్ క్యామెరాన్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. గతంలో స్పై కిడ్స్.. డెస్పరాడో వంటి సినిమాలను తీసిన రోబర్డ్ రోడ్రిగ్జ్ దర్శకత్వంలో ఒక సెన్సేషనల్ సినిమా రూపొందించాడు. ఆ సినిమాయే 'ఎలిటా'. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారంటే.. ఆ సినిమా ఎలా ఉంటుందో అర్దం చేసుకోండి.విషయం ఏంటంటే.. మీరు యానిమో (మాంగా) అనే పేరుతో వచ్చే జపనీస్ యానిమేషన్ చిత్రాల గురించి వినే ఉంటారు. ఈ సినిమాల్లో ముఖ్యంగా ప్రతీ బొమ్మకూ కళ్ళు పెద్దవిగా ఉంటాయి. దానినే యానిమో స్టయిల్ అంటారు. ఇప్పుడు రియల్ లైఫ్ క్యారక్టర్ కూడా అలా యానిమో బొమ్మ తరహాలో కళ్ళను కలిగియుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే ఐడియాతో.. మనిషికి అలా కళ్లను మారిస్తే బాగోదు కాబట్టి.. 'ఎలిటా' అనే ఒక హ్యూమనాయిడ్ రోబోను తయారు చేశారు. మనుషులవలే ఫీలింగ్స్ కలిగియుండే ఆ ఎలిటాను సొంతం చేసుకోవాలని కొందరు.. నాశనం చేయాలని ఇంకొందరు.. దానితో లోక రక్షణ చేపట్టాలని కొందరు.. వెరసి వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. దాని పేరే 'ఎలిటాః బ్యాటిల్ ఏంజెల్'.

మేజ్ రన్నర్ సినిమా ఫేం నటీమణి రోసా సలాజార్ ఈ సినిమాలో యానిమో క్యారక్టర్ తరహాలో కనిపిస్తోంది. ఆమె కళ్లను వివిధ టెక్నిక్స్ తో గ్రాఫిక్స్ లో అలా పెద్దవిగా మార్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూలై 20. 2018న రిలీజవ్వనుంది. ఇంకెందుకు లేటు.. ముందు ట్రైలర్ చూడండి!!