ఆలియాపై అమూల్ యాడ్ బాగుందిగా

Wed May 16 2018 16:11:42 GMT+0530 (IST)

అమూల్ సంస్థ పాల ఉత్పత్తుల విషయంలోనే కాదు.. క్రియేటివ్ గా ప్రకటనలు రూపొందించడంలో మహా హుషారుగా ఉంటుంది. ఏళ్ల తరబడి తన కాన్సెప్టులతో అలరిస్తున్న అమూల్.. ఇప్పుడు ఆలియా భట్ పై ఓ పోస్టర్ ను విడదల చేసింది.అట్టర్లీ బటర్లీ డెలిషియస్ అంటూ అమూల్ యాడ్ ఉంటుందనే సంగతి తెలిసిన విషయమే. అయితే.. ఇదే ప్రకటనను 'అట్టర్లీ భట్టర్లీ డెలిషియస్' అంటూ ఆలియా పేరు మీద మార్చేసింది అమూల్ కంపెనీ. అంతే కాదు.. సబ్ రాజీ హై అంటూ రాసిన క్యాప్షన్ కూడా అదిరింది. ఈ పోస్టర్లో అమూల్ యాడ్ లో కనిపించే పిల్ల ఎప్పుడూ కనిపించే బొమ్మే అయినా.. ఈ పోస్టర్ ను మాత్రం ఆలియా రీసెంట్ మూవీ రాజీ పోస్టర్ ఆధారంగానే రూపొందించారు. బ్యాక్ గ్రౌండ్ థీమ్ మాత్రమే కాదు.. అచ్చు ఆలియా వేసిన డ్రెస్ డిజైన్ నే బొమ్మకు కూడా వేశారు.

కాకపోతే ఆలియా చేతిలో గన్ ఉంటుంది.. ఈ బొమ్మ చేతుల్లో బ్రెడ్ ఉంటుంది. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్. మే 11న విడుదల అయిన రాజీ చిత్రానికి సూపర్ టాక్ వచ్చింది. కూతురు.. భార్య.. వేరియేషన్స్ తో పాటు ఒక స్పై గా కూడా కనిపించే పాత్రలో ఆలియా భట్ నటనను అందరూ తెగ మెచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు అమూప్ పాప కూడా ఇదే అంశంపై తన స్టైల్ లో సర్టిఫికేట్ ఇచ్చేసింది.