Begin typing your search above and press return to search.

ఆలియా మసాలా కోరిక బయటపెట్టింది!

By:  Tupaki Desk   |   26 July 2016 3:55 AM GMT
ఆలియా మసాలా కోరిక బయటపెట్టింది!
X
ప్రతీ నటుడికి - నటికి ఒక మూసదోరణిలో సినిమాలు చేస్తూపోవడం ఇష్టం ఉండదు. పరిశ్రమలో నిలదొక్కుకోవాలని తపనపడే నటులంతా.. అన్నిరకాల పాత్రలూ చేయాలని తపిస్తుంటారు. అలా చేస్తేనే వారికి నాలుగు కాలాలపాటు అన్ని రకాల ప్రేక్షకుల్లోనూ స్థానం పదిలంగా ఉంటుంది. తాజాగా ఈ విషయాలను తెలుసుకుందో లేక ఎప్పుడో తెలుసుకుని ఇప్పుడు బయటపెట్టిందో కానీ.. తన ఫీలింగ్స్ అన్నీ చెప్పుకొచ్చింది ఆలియా భట్.

‘మై నేమ్ ఈజ్ షీలా.. షీలా కీ జవానీ’ అని - ‘చిక్ నీ చమేలీ’ అని కత్రినా కైఫ్ ఏ రేంజ్ లో మాస్ మసాలా సినిమాలు చేసిందో.. అలాగే తానుకూడా మాస్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అన్ని రకాల పాత్రలు చేయగలనని అంటుంది. అయితే హైవే - ఉడ్తాపంజాబ్ వంటి సినిమాలు ఆలియా లో ఉన్న నటిని చూపించినా.. అన్నీ ఒకేరకం సినిమాలూ చేసుకుంటూ పోవడం కాకుండా.. అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉందని ముఖ్యంగా మాస్ మసాలా పాత్రల్లో నటించాలని ఉందని చెప్పింది.

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాలోని ‘రాధా’ పాటలో ఓ మాదిరిగా కనిపించిన ఆలియా.. ఇకపై ఏమాత్రం అవకాశం ఉన్నా మసాలా పాత్రల్లో కనిపించాలని ఆశపడుతోంది. కాగా ప్రస్తుతం వరుణ్ ధావన్ తో అభిషేక్ బర్మన్ దర్శకత్వంలో బద్రీనాథ్ కీ దుల్హనియా అనే సినిమా చేస్తోంది.