Begin typing your search above and press return to search.

ఆపండహె రచ్చ.. అలియా 70 కిలోలే.. సామ్ 100!

By:  Tupaki Desk   |   14 Sep 2019 4:59 AM GMT
ఆపండహె రచ్చ.. అలియా 70 కిలోలే.. సామ్ 100!
X
కొంతమందిని కదిలిస్తే చాలు ఆ కాలంలో తెలుగు అద్భుతం.. సంగీతం అద్భుతం.. కథలు అద్భుతం.. నటన అద్భుతం అంటూ చెప్పుకుంటూ పోతారు. ఈ కాలం అంతా బీ గ్రేడు సి గ్రేడు అంటారు. కానీ అన్నీ విషయాల్లో అది నిజంకాదు. పాత కాలంలో ఎక్కువ మంది సినిమా హీరోలు హీరోయిన్లు ఫిట్ గా ఉండేవారు కాదు. అదే ఈ జెనరేషన్ హీరో హీరోయిన్లను తీసుకోండి. ఫిట్నెస్ కు కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగా ఉంటారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ దాదాపు 90 % శాతం ఫిట్ గా ఉండేవారే.

పొద్దున్నే ఈ ఆరోగ్యం మహాభాగ్యం క్లాసు ఎందుకంటే తాజాగా అలియా భట్టు వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆమె ఎవరు అని మీరు అడగరు లెండి. ఎంత బాలీవుడ్ భామ అయినా రాజమౌళి 'RRR' లో నటిస్తోందిగా.. తెలిసిపోయి ఉంటుంది. చూసేందుకు ఈ భామ మహా సుకుమారిలా ఉంటుంది. కానీ జిమ్ములో కఠినమైన కసరత్తులను అవలీలగా చేస్తుంది. అందులో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తుంది. రీసెంట్ గా అలియా 70 కిలోల వెయిట్ ను ఎత్తి అందరినీ షాక్ కు గురిచేసింది. ఆ వీడియోను అలియా భట్ ట్రెయినర్ సొహ్రాబ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అలియా రీసెంట్ గానే ఈ వెయిట్ ట్రైనింగ్ ప్రారంభించిందని.. తక్కువ సమయంలో ఇలా 70 కిలోలు ఎత్తగలిగిందని.. అలియా డెడికేషన్ సూపరని ఆయన అన్నారు. దీంతో అందరూ అలియాను తెగ మెచ్చుకుంటున్నారు. కొందరైతే అలియా రికార్డు సృష్టించిందని కూడా అంటున్నారు.

అలియాను మెచ్చుకోవడం వరకూ ఒకే కానీ ఇది రికార్డు మాత్రం కాదు. ఎందుకంటే సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా అప్పుడెప్పుడో ఇలాంటి పని చేసింది. 70 కిలోలు 80 కిలోలు కాదు. మన రామలక్ష్మి ఎత్తిన బరుకు అక్షరాలా.. వంద కిలోలు. అంకెల్లో 100. అందుకే రికార్డులు గట్రా మాట్లాడకుండా అలియా ఫిట్నెస్ ను మెచ్చుకోవాలి అంతే. ఎందుకంటే అక్కినేని కోడలమ్మకు చిర్రెత్తుకొచ్చిందంటే మరో 10 కేజీలు జోడించి 110 కిలోలు ఎత్తే వీడియోను పోస్ట్ చేస్తుంది..!