Begin typing your search above and press return to search.

దీపిక స్థానానికి అలియా ఎసరు పెడుతోందా?

By:  Tupaki Desk   |   23 March 2019 5:12 PM GMT
దీపిక స్థానానికి అలియా ఎసరు పెడుతోందా?
X
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ పేరు గతంలో హిందీ సినిమాలు ఫాలో అయ్యేవారికి మాత్రమే తెలిసి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం దాదాపు తెలుగు సినీ ప్రియులందరికీ తెలుసు. కారణం రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ 'RRR' లో రామ్ చరణ్ సరసన అలియాను హీరోయిన్ గా ఎంపిక చేయడమే. ఈ ఎంపిక పట్ల అలియా కూడా ఫుల్ గా ఎగ్జైట్ అయిందనుకోండి. అలియా ప్రస్తుతం హిందీలో టాప్ లీగ్ హీరోయిన్. RRR లో ఎంపిక కావడంతో అలియా క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయింది.

ఇప్పటివరకూ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే దాదాపుగా అందరూ దీపిక పదుకొనె పేరు చెప్పేవారు. కంగనా కూడా టాప్ హీరోయినే. కంగనాకు కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్.. స్టార్డమ్ ఉన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలు చేయడం దాదాపుగా మానేయడంతో ఆమె ఒక రకం సినిమాలకు పరిమితమైంది. అందుకే భారీ ప్రాజెక్టులు అంటే చాలు మొదటి ఛాయిస్ దీపిక పదుకొనె. కానీ దీపిక ఈమధ్య తన ప్రాజెక్టులను ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది. దీంతో భారీ ప్రాజెక్టులకు మొదటి అలియా మొదటి ఛాయిస్ గా మారింది. 'కళంక్'.. 'బ్రహ్మాస్త్ర' లాంటి సినిమాలలో అలియా ఇప్పటికే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా 'RRR'.. సల్మాన్ ఖాన్ - సంజయ్ లీలా భన్సాలి కాంబోలో తెరకెక్కనున్న 'ఇన్షాఅల్లా' లో కూడా హీరోయిన్ గా ఎంపికయింది. బాలీవుడ్ లో ఒకేసారి ఇన్ని క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్న హీరోయిన్ ఇప్పుడు అలియా భట్ మాత్రమే. ఈ లెక్కన అలియా త్వరలో దీపిక స్థానానికి ఎసరు పెట్టడం ఖాయమని అంటున్నారు.

అలియాను RRR కు ఎంపిక చేయడం విన్/విన్ సిట్యుయేషన్ లాంటిది. RRR హీరోయిన్ కావడంతో అలియా క్రేజ్ డబల్ అయింది. రిలీజ్ తర్వాత మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు RRR రిలీజ్ అయ్యే సమయానికి అలియా కూడా దీపిక స్థానాన్ని కైవసం చేసుకొని బాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్ గా మారే ఛాన్స్ ఫుల్ గా ఉంది. అలా జరిగితే RRR విషయంలో బాలీవుడ్ మార్కెట్ కు అలియా బిగ్గెస్ట్ ప్లస్ గా మారే అవకాశం కూడా ఉంది. ఇదంతా చూస్తే అలియాను ఎంపిక చేయడం రాజమౌళి బెస్ట్ డెసిషన్ అని చెప్పవచ్చు.