ఆలియాపై 1000 కోట్ల బెట్టింగ్!

Thu Mar 14 2019 15:34:43 GMT+0530 (IST)

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వ ం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని ఎవరి పాత్రలు ఏంటి? అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. ఎట్టకేలకు కథానాయికలు ఎవరు? అన్నదానిపైనా రాజమౌళి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రంలో ఆలియా భట్ కన్ఫామ్ అయ్యిందని చాలా కాలంగా వార్తలు వస్తున్నా.. దానిపైనా ఇంతకాలం పూర్తిగా కన్ఫర్మేషన్ లేదు. తాజాగా ఆలియా భట్ ని ఫైనల్ చేశామని రాజమౌళి ప్రకటించారు. ఆలియాతో పాటు హాలీవుడ్ నాయిక డైజీ ఎడ్గార్ జోన్స్ ని వేరొక పాత్రకు ఖరారు చేశారు.అయితే ఆలియా భట్ ని విమానాశ్రయంలో కలిసి రాజమౌళి సీత పాత్రను ఆఫర్ చేశారు. ఆలియా ఆసక్తిని కనబరిచింది. అంతవరకే జరిగింది  ఆ ఎపిసోడ్ లో. ఆ తర్వాత ఆలియాని కన్ఫామ్ చేస్తూ రాజమౌళి తనకు సమాచారం పంపించాకే నేడు మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ఇప్పటివరూ ఆలియాకు కూడా క్లారిటీ  మిస్సయ్యిందనే అర్థమవుతోంది. నేడు ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లైవ్ జరుగుతుండగా ఆలియాని కన్ఫామ్ చేస్తూ రాజమౌళి ప్రకటించిన అనంతరం తనని ఈ ప్రాజెక్టులోకి తీసుకున్న ందుకు ఆలియా ఉబ్బి తబ్బిబ్బయ్యింది. ఇంతటి భారీ క్రేజీ ప్రాజెక్టుకు ఖాయం చేసినందుకు ఆ ఆనందంలో డ్యాన్సాడుతున్న అందమైన అమ్మాయి ఈమోజీల్ని ఆలియా ట్వీట్ చేసింది. 'ఈరోజు నేను ఎంతో గొప్పగా ఫీలవుతున్నా. ఈ అందమైన ప్రయాణం మొదలు పెట్టే వరకూ ఆగలేను. భారీ టీమ్.. అద్భుతమైన కాస్టింగ్.. థాంక్యూ రాజమౌళి సర్.. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది..' అని ఆలియా ట్వీట్ చేసింది.

ఆలియా స్ప ందనకు ప్రతిస్ప ందనగా ఎస్.ఎస్.రాజమౌళి సైతం రిప్లయ్ ఇచ్చారు. బాలీవుడ్ లో రైజింగ్ స్టార్ గా ఎదిగేస్తూ ఇతర సహనాయికలకు పోటీ ఇస్తున్న నీకు ఈ అవకాశం ఇస్తున్నా. నేను కూడా నీ రాక కోసం వేచి చూస్తున్నా అని రాజమౌళి ఆన్సర్ చేశారు. మొత్తానికి బాలీవుడ్ లో భారీ చిత్రాల్లో నటిస్తున్న ఆలియాని ఆర్.ఆర్.ఆర్ కి ఖాయం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు స్థాయిని అమాంతం పెంచేశారు జక్కన్న. ఆలియా ఇప్పటికే కళాంక్ అనే పీరియాడికల్ మూవీలో నటిస్తోంది. ఆ సినిమాలో ఆలియా అద్భుతమైన పాత్రలో నటిస్తోంది. మరోవైపు రాజీ లాంటి చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించి 100 కోట్లు కొల్లగొట్టగలిగే సత్తా తనకు ఉందని ఆలియా నిరూపించింది. కళాంక్ చిత్రం ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. అలాగే కరణ్ జోహార్ నేతృత్వ ంలోని మరో భారీ ఫిక్షన్ చిత్రం బ్రహ్మాస్త్ర లోనూ ఆలియా కథానాయికగా నటిస్తోంది. బ్రహ్మాస్త్ర చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజవుతోంది. ఈలోగానే ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ ఆఫర్ వరించింది. అంటే ఒకేసారి వందల కోట్ల బడ్జెట్లతో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్లలో ఆలియా అవకాశం అందుకోవడం చూస్తుంటే వర్థమాన కథానాయికల్లో ఇంత క్రేజీ స్టార్ ని వేరొకరిని చూడలేం అనడంలో సందేహమే లేదు. అంటే ఆలియాపై వందల కోట్ల బెట్టింగ్ పెడుతున్నట్టే లెక్క. ఆలియా నటిస్తున్న ఆ మూడు సినిమాల బడ్జెట్లు కలిపితే 1000 కోట్లు అన్నమాట!!