బ్యూటీఫుల్ కపుల్ మద్య విభేదాలు

Sat Feb 23 2019 23:00:01 GMT+0530 (IST)

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ గత ప్రేమ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం క్యూట్ బ్యూటీ ఆలియా భట్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్న విషయం వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా అనధికారికంగా ఒప్పుకున్నారు. త్వరలోనే పెళ్లికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆలియా భట్ తండ్రి మాట్లాడుతూ తన కూతురు ప్రస్తుతం రణబీర్ కపూర్ తో స్నేహంగా ఉంటుందని - అతడితో పెళ్లి కావాలంటే చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న ఈ కపుల్ మద్య విభేదాలు మొదలైనట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం వీరిద్దరు కలిసి 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం కోసం సౌందర్య శర్మ అనే మోడల్ ను చిన్న పాత్ర కు తీసుకున్నారట. ఆమెతో రణబీర్ కపూర్ చాలా సన్నిహితంగా ఉంటున్నాడని -ఆమెకు ఆఫర్లు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సౌందర్య శర్మతో క్లోజ్ నెస్ వల్లే ఆలియా భట్ కు రణబీర్ కపూర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉందట. ఈ వివాదం ముదిరి పాకాన పడి ఇద్దరు విడిపోతారో లేదంటే లైట్ గానే ఈ గొడవ తేలిపోతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే బాలీవుడ్ వర్గాల్లో ఈ వ్యవహారం సీనియస్ గా చర్చ జరుగుతోంది.