Begin typing your search above and press return to search.

అలీ కి మళ్లి యాంకర్ గా ఛాన్స్

By:  Tupaki Desk   |   11 Dec 2017 6:10 AM GMT
అలీ కి మళ్లి యాంకర్ గా ఛాన్స్
X
కమెడియన్ ఆలీ ఇటు యాంకరింగ్ లోను.. అటు సినిమా ఫంక్షన్స్ లో హోస్ట్ గాను బోలెడంత ట్యాలెంట్ చూపించేస్తాడు. అయితే.. కొంతకాలంగా ఆలీని సినిమా ఫంక్షన్స్ కు పిలుస్తున్నా.. వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశాలు బాగా తగ్గాయి. ఇందుకు కారణం.. గతంలో ఈయన హీరోయిన్స్ పై చేసిన కొన్ని కామెంట్స్.

అనుష్క తొడల పైనా.. సమంత బొడ్డుపైనా ఆలీ కామెంట్స్ దుమారం రేపాయి. ప్రస్తుతం అక్కినేని నాగార్జున కోడలు అయిన సమంత గురించి మాట్లాడుతూ 'ఆమె బొడ్డు బెజవాడ బెంజ్ సర్కిల్ లా ఉంటుంది' అంటూ గతంలో ఓ వేడుకలో ఆలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. నాగార్జున మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా.. హలో ఆడియో ఫంక్షన్ లో హోస్ట్ గా ఆలీకి ఛాన్స్ ఇవ్వడం గమనించాలి. అయితే.. హలో ఈవెంట్ లో కూడా ఆలీ తన స్టైల్ లో కామెడీ పంచ్ లు పేల్చినా.. వాటి డోస్ ను మాత్రం తగ్గించాడు.

ఓ ప్రియా ప్రియా అంటూ పాటతో మొదలుపెట్టిన ఆలీ.. 'ఈ పాట నీ కోసం కాదు.. మా ఆవిడ కోసం' అంటూ సుమ ను కామెంట్ చేసినా.. ఆ వెంటనే 'హలో హలో అంటోంది కొంటె మనసు' అంటూ ఏఎన్నాఆర్ పాడిన పాటను గుర్తు చేశాడు. ఆ తర్వాత హలో బ్రదర్ సూపర్ సక్సెస్ అయిందన్న ఆలీ.. ఇప్పుడు హలో థౌజండ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తుందని చెప్పాడు.