Begin typing your search above and press return to search.

ధోని పాత్రను ఆ స్టార్ హీరో చేసి ఉంటే..

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:30 PM GMT
ధోని పాత్రను ఆ స్టార్ హీరో చేసి ఉంటే..
X
గత ఏడాది ధోని మీద ఓ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలు వచ్చినపుడు జనాలు లైట్ తీసుకున్నారు. ధోని గురించి అందరికీ తెలిసిందే కదా.. కొత్తగా ఏం చూపిస్తారు అనుకున్నారు. పైగా ఇందులో బడ్డింగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో అనగానే పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ చూశాక జనాల అభిప్రాయం మారింది. ఆ టీజర్ అంత ఆసక్తికరంగా అనిపించింది. పైగా ధోనిని బాడీ లాంగ్వేజ్ ను.. అతడి నడకను డిట్టో దించేస్తూ సుశాంత్ కనిపించిన తీరుకు ఫిదా అయిపోయారు జనాలు. ఇక తాజాగా ట్రైలర్లో హెలికాఫ్టర్ షాట్ సహా ధోని మార్కు క్రికెటింగ్ షాట్లు ఆడటమే కాక.. అతడి పాత్రలోకి ఒదిగిపోయి వావ్ అనిపించాడు. ఇప్పుడందరి నోటా ఒకటే మాట. ధోని పాత్రకు సుశాంత్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని.

ఐతే నిజానికి ఈ ప్రాజెక్టు మొదలైనపుడు ‘ధోని’ పాత్రకు సుశాంత్ ను అనుకోలేదట. ఓ పెద్ద స్టార్ హీరో ఈ పాత్ర చేయడానికి ముందుకొచ్చాడు. ఆ హీరో మరెవరో కాదు.. అక్షయ్ కుమార్. ‘ఎం.ఎస్.ధోని’ చిత్ర దర్శకుడు నీరజ్ పాండేకు అక్షయ్ చాలా క్లోజ్. ధోని మీద సినిమా తీయాలనే ఆలోచన ముందు అతడితోనే పంచుకున్నాడట నీరజ్. ఆ పాత్రను తనే చేస్తానని కూడా అక్షయ్ ముందుకొచ్చాడట. ఐతే ఒక ఫొటో షూట్ చేశాక అక్షయ్ ఆ పాత్రకు సరిపోడని భావించాడట నీరజ్. పైగా ఈ సినిమా కోసం చాలా సాధన చేయాల్సి ఉంటుందని.. ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి ఉంటుందని.. అక్షయ్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాకు కావాల్సినన్ని డేట్లు ఇవ్వలేడని భావించి అతడికి నో చెప్పేశాడట నీరజ్. తర్వాత చాలామందిని పరిశీలించి చివరికి సుశాంత్ ను ఓకే చేశాడట. మరి ధోని పాత్రలో అక్షయ్ నటించి ఉంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకుని చూడండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/