Begin typing your search above and press return to search.

హోమో గా అక్షయ్ కుమార్?

By:  Tupaki Desk   |   1 Aug 2015 7:30 AM GMT
హోమో గా అక్షయ్ కుమార్?
X
ఇండియన్ సినిమా ఈ మధ్య చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఒకప్పుడు సినిమాలో ఒక గే క్యారెక్టర్ పెట్టడానికి చాలా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు హోమో సెక్సువల్స్ మీద లెస్బియన్ ల మీద పూర్తి స్థాయి సినిమాలే తయారైపోతున్నాయి. మన టాలీవుడ్ లో కూడా ఈ మధ్య చాలా సినిమాల్లో గే క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. ఈ ఒరవడికి పునాది వేసింది దోస్తానా సినిమానే అని చెప్పాలి. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం అలాంటి స్టార్ హీరోలు గే వేషాలు వేయడం.. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో గే క్యారెక్టర్ల విషయంలో మొహమాటాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. గే వేషాలు వేయడానికి మిగతా హీరోలు కూడా సంకోచించట్లేదు.

అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ సైతం హోమో సెక్సువల్ క్యారెక్టర్ కు పచ్చజెండా ఊపేయడం విశేషం. ఇది అభిషేక్ లాగో, జాన్ లాగో ఊరికే గే లా నటించే పాత్ర కూడా కాదు. నిజంగానే గే అన్నమాట. రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిషూమ్’లో అతను హోమో క్యారెక్టర్ చేయబోతున్నట్లు ప్రకటించడం సంచలనం రేపుతోంది. రోహిత్ తొలి సినిమా ‘దేసీ బాయ్స్’లో అక్షయ్ ముఖ్య పాత్ర పోషించాడు. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ ఉత్సాహంలో డిషూమ్ కథ రెడీ చేసి.. అక్షయ్ కు సవాలు విసిరే పాత్ర ఆఫర్ చేశాడట రోహిత్. ఐతే అక్షయ్ పెద్దగా సంకోచించకుండా ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పేశాడట. అక్షయ్ పాత్ర భలే తమాషాగా ఉంటుందని.. ఈ క్యారెక్టర్ తో అద్భుతమైన కామెడీ పండుతుందని అంటున్నాడు రోహిత్.