Begin typing your search above and press return to search.

300 రోజులు ఏం పొడుస్తారంటున్న హీరో

By:  Tupaki Desk   |   27 April 2016 9:30 AM GMT
300 రోజులు ఏం పొడుస్తారంటున్న హీరో
X
నెలలు.. సంవత్సరాల తరబడి సినిమాలు తీసేవాళ్లపై సెటైర్లు గుప్పించాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. నెలకు కనీసం మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించే అక్షయ్.. షూటింగ్ కోసం పని దినాలు వ్యర్థం చేసే వారిపై విమర్శలు గుప్పించాడు. తన దృష్టిలో మామూలు సినిమా తీయడానికి రెండు నెలలు సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. ‘‘నా కొత్త సినిమా ‘హౌస్ ఫుల్-3’ని కేవలం 38 రోజుల్లో పూర్తి చేశాం. భారీ తారాగణం ఉన్నా సరే.. పక్కా ప్లానింగ్‌ తో బరిలోకి దిగడం వల్ల ఇంత తక్కువ రోజుల్లో షూటింగ్ అయిపోయింది. నా దృష్టలో రెండు నెలలకు మించి సినిమా తీయడానికి వీల్లేదు. కొందరు 300 రోజుల పాటు షూటింగ్ చేస్తుంటారు. వీళ్లు అంత టైంలో ఏం చేస్తారో నాకర్థం కాదు’’ అని అక్షయ్ కుమార్.

ప్రి ప్రొడక్షన్.. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో టైం తీసుకున్నా తనకు ఇబ్బంది లేదని.. కానీ షూటింగ్ విషయంలో లేట్ చేస్తే మాత్రం చాలా చిరాకని అక్షయ్ అన్నాడు. ‘‘హౌస్ ఫుట్ షూటింగ్ చేసిన రోజుల కంటే.. ఆ సినిమా ట్రైలర్ రూపొందించడానికి ఎక్కువ రోజులు పట్టింది. రెండున్నర గంటల సినిమాను రెండున్నర నిమిషాల ట్రైలర్ గా మార్చడానికి మా చిత్రబృందం చాలా కష్టపడింది. అనేక వెర్షన్లు తయారు చేసి.. చివరికి ఒకటి ఓకే చేశాం. ఐతే ప్రి ప్రొడక్షన్.. పోస్ట్ ప్రొడక్షన్ లేటవడం వల్ల ఏ నష్టం లేదు. కానీ షూటింగ్ లో పని దినాలు ఎక్కువైతే మాత్రం బడ్జెట్ బాగా పెరుగుతుంది’’ అని అక్షయ్ చెప్పాడు. ఐతే అక్షయ్ విలన్ పాత్ర పోషిస్తున్న ‘రోబో-2’ షూటింగ్ కనీసం ఏడాదైనా సాగేలా ఉంది. మరి అది స్పెషల్ మూవీ కాబట్టి క్షమించేస్తాడేమో అక్షయ్.