Begin typing your search above and press return to search.

ఆ పాత్ర కోసం స్టార్ హీరోల ఫైట్

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:12 AM GMT
ఆ పాత్ర కోసం స్టార్ హీరోల ఫైట్
X
ఒక స్క్రిప్ట్ ఒక హీరో చెబితే అతను ఆ స్క్రిప్ట్ ని కాదునడం మరో హీరో హిట్ కొట్టడం మనకు తెలుసు. ఒకే సినిమాలో ఒక పాత్ర కోసం కొందరు పోటీ పడి ప్రయత్నం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇదే పోటీ ఇద్దరు సూపర్ స్టార్లు మధ్య జరిగితే ఆ న్యూస్ మంచి ఉత్కంఠగా ఉంటుంది కదూ. అవును నిజమే.. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ ఇప్పుడు ఒక సినిమా కథ కోసం పోటీ పడుతున్నారు.

1989 లో రానిగంజ్ లో జరిగిన బొగ్గు ఘని దుర్ఘటన ఆధారంగా ఒక సినిమా నిర్మించబోతున్నారు. అక్షయ్ కుమార్ ఈ సినిమా చేయడానికి యెస్ చెప్పారుని తెలుస్తుంది. జశ్వంత్ సింగ్ గిల్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించనున్నాడు. ఈ బొగ్గు ఘని ప్రాజెక్టు ని ముందుకు నడిపే ఇంజినీర్ పాత్రలో అక్షయ్ నటించడానికి అంతా తయారుకాబోతున్న టైమ్ లో అజయ్ దేవగన్ కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి ఆశక్తి చూపిస్తున్నారు అని తెలుస్తోంది. అజయ్ ఈ పాత్రలో నటిస్తున్నాడు అని టినూ సురేశ్ దేశాయి డైరెక్ట్ చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి.

రియల్ ఇంజినీర్ జశ్వంత్ మాట్లాడుతూ “ ఈ సినిమా ప్రాజెక్టు కోసం కొంతమంది నన్ను సంప్రదించారు. ఇంకా హీరో ఎవరు అనేది ఒక నిర్ణయంకు రాలేదు అని చెప్పారు. అజయ్ దేవగన్ ఆఫీసు నుండి కూడా కొందరు వచ్చి కలిసి మాట్లాడారు'' అని తెలిపారు. అజయ్ దేవగన్ కు అక్షయ్ కుమార్ కు ఇంతకు ముందు కూడా ‘1897 బాటిల్ ఆఫ్ సరాగర్హ్’ సినిమా విషయంలో కూడా ఇలానే ఘర్షణ ఏర్పడింది. అజయ్ ఇప్పుడు రింగ్ లో ఉన్నాడు. మరి అక్షయ్ కుమార్ దీనికి ఎటువంటి జవాబు ఇస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/