Begin typing your search above and press return to search.

అవార్డుల సీక్రెట్ చెప్పిన సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   25 May 2016 4:20 AM GMT
అవార్డుల సీక్రెట్ చెప్పిన సూపర్ స్టార్
X
షారూక్ ఖాన్ బాలీవుడ్ కి బాద్ షా. ఇప్పుడేవో ఒకట్రెండు సినిమాలు కలెక్షన్స్ లో వెనకబడి ఉండొచ్చు కానీ.. కింగ్ ఖాన్ ఎప్పుడూ షారూక్. అది ఫ్యాన్స్ నరనరాల్లో జీర్ణించుకుపోయిన విషయం. వసూళ్లలోనే కాదు.. యాక్టింగ్ లోను.. తన యాక్టింగ్ కి గుర్తింపుగా వచ్చే అవార్డుల్లోనూ షారుక్ కి లెక్కలేనన్ని అవార్డులు వచ్చాయి, వస్తూనే ఉంటాయి కూడా.

ఇలా షారూక్ ఖాన్ కే అనేక అవార్డులు రావడంపై మరో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నోరు విప్పాడు. అంతే కాదు.. సీక్రెట్ విప్పినట్లుగా చెప్పి పెద్ద షాక్ నే ఇచ్చాడు. రీసెంట్ గా ఈ ఖిలాడికి ఓ క్వశ్చన్ ఎదురైంది. గతేడాది మీ మూవీ బేబీకి ఎందుకు అవార్డు రాలేదు అన్నది ఆ ప్రశ్న. దీనికి అక్షయ్ కుమార్ ఇచ్చిన ఆన్సర్ విని.. అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. 'అవార్డు ఫంక్షన్లలో పెర్ఫామ్ చేసినందుకు తీసుకునే రెమ్యూనరేషన్ లో.. సగానికే చేస్తే సరిపోతుంది. అవార్డు గెలుచుకోవాలంటే ఐడియా అదే' అనేశాడు అక్షయ్.

అవార్డ్ ఫంక్షన్లలో పెర్ఫామ్ చేయడం - హోస్టింగ్ చేయడం.. నానా హంగామా ఇలాంటివన్నీ చేసేది షారుక్ ఖాన్ మాత్రమే. అందుకే అక్షయ్ వేసిన ఈ పంచ్ బాలీవుడ్ బాద్షాకే అంటున్నారు బాలీవుడ్ జనాలు. అయితే నేషనల్ అవార్డుల విషయంలో మాత్రం తనకు గౌరవం ఉందన్న అక్షయ్.. అక్కడ తన చిత్రానికి నామినేషన్ రాకపోతే మాత్రం.. బేబీ గొప్ప చిత్రం కాదని అంగీకరిస్తానని చెప్పాడు.