Begin typing your search above and press return to search.

బావుంది కానీ 100 కోట్లు కష్టమే

By:  Tupaki Desk   |   21 Feb 2018 5:23 AM GMT
బావుంది కానీ 100 కోట్లు కష్టమే
X
రొటీన్ కి భిన్నంగా ఉండే కథలను సెలెక్ట్ చేసుకుపోవడమే కాదు వాటితో హిట్లు కొట్టడం కూడా అంత సులువైన లని కాదు. కానీ బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ కు మాత్రం అది వెన్నతో పెట్టిన విద్య. ఆయన చేసే సినిమాలు కానీ వాటి కథలు గాని చాలా కొత్తగా ఉంటాయి. ఈమధ్య చేసిన ప్యాడ్ మాన్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది.

సినిమా ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నందువల్ల అందరూ సినిమా పెద్ద హిట్ అయిపోతుంది 100 కోట్లు దాటేస్తుంది అని అనుకున్నారు. ఎంత సినిమా బాగున్నా అది ఇపుడు సాధ్య పడేలా లేదు. మల్టీప్లెక్స్ లలో ఆడుతున్న ఈ సినిమా కలెక్షన్లు దాదాపుగా పడిపోయాయి అని చెప్పచ్చు. అయితే ఈ సినిమా కంటే వారం ముందే విడుదల అయిన పద్మావత్ సినిమా చాలా మంచి టాక్ వస్తూ ఉండడంతో ఇంక ప్యాడ్ మాన్ సినిమాను చూసే నాథుడు లేకుండా పోయాడు. ఒక పక్క రకుల్ అయ్యారి కూడా ఇపుడు బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చేయడంతో ప్యాడ్ మాన్ థియేటర్లు వెల వెల బోతున్నాయి. .

కానీ ఏదేమైనా స్టోరీ బావుంటే ఎవరు మాత్రం ఆపగలరు చెప్పండి. అందుకే ఇంకొన్నాళ్లు ప్యాడ్ మాన్ థియేటర్ లో సందడి చేయడం మనం గమనించవచ్చు కానీ 100 కోట్ల క్లబ్ కి ఎక్కటం మాత్రం ప్యాడ్ మాన్ కు ఒక అందని ద్రాక్షగా మిగిలిపోతుందని సినిమా పండితులు చెప్పేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో..