కిలాడీ తర్వాత లక్కీ గయ్..

Mon Jan 21 2019 20:59:12 GMT+0530 (IST)

తలైవా రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ `2.ఓ`లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పక్షిరాజుగా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ భారీ విజయాన్ని సాధించింది. అయితే అనుకున్న స్థాయిలో వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. గ్రాఫిక్స్ శంకర్ సినిమా స్థాయిలో లేవని ఆయన స్థాయికి తగ్గట్టుగా సినిమాను నిర్మించలేదని అటు తమిళ మీడియాతో పాటు తెలుగు మీడియా కూడా శంకర్ కు చురకలంటించింది. దీంతో కసి మీదున్న ఆయన తన తదుపరి చిత్రంగా `భాయతీయుడు-2`ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.ఈ నెల 18న మొదలైన ఈ సినిమాలో కమల్ హాసన్ మరోసాని సేనాపతిగా విజృభించబోతుండగా అతనికి జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించబోతోంది. `2.ఓ` సినిమాకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను కీలక పాత్ర కోసం తీసుకున్న దర్శకుడు శంకర్ ఈ సినిమా కోసం కూడా మరో బాలీవుడ్ స్టార్ ని దించేస్తున్నాడు. అతనెవరో కాదు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్. సినిమాలో అభిషేక్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా సాగుతుందని అందుకే మరో ఆలోచన చేయకుండా శంకర్ ఆఫర్ ను అభిశేక్ బచ్చన్ ఓకే చేశాడని తెలిసింది.

అభిషేక్ బచ్చన్ తో పాటు ఇందులో అక్షయ్ కుమార్ కూడా కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో అక్షయ్ కుమార్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించే అవకాశం వుందని చెబుతున్నారు. `2.ఓ` ఫేమ్ సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని తమిళ చిత్ర వర్గాలు అంటున్నాయి.  ఇకపోతే శంకర్ తన ప్రతి సినిమాలో బాలీవుడ్ కథానాయకులకు అవకాశాలిస్తున్నాడు. నీల్ నితిన్ ముఖేష్ కి ఐలో అక్షయ్ కి `2.ఓ`లో ఛాన్సులిచ్చాడు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కి జాక్ పాట్ తగిలింది.