Begin typing your search above and press return to search.

​శ్రీదేవి కూతురు లవ్ హేట్ స్టోరీ

By:  Tupaki Desk   |   25 Jun 2017 8:08 AM GMT
​శ్రీదేవి కూతురు లవ్ హేట్ స్టోరీ
X
శ్రీదేవి - ఆమె కూతురు ఝన్వి కపూర్ సినిమాలు ఏమి చేయకుండానే ఈ మధ్య వార్తలులోకి వస్తున్నారు. అమ్మ శ్రీదేవి బాహుబలి ప్రశ్నలతో సతమతం అవుతుంటే ఇటు వైపు కూతురు తన ఫ్యాషన్ తో కొత్త బాయ్ ఫ్రెండ్ తో పార్టీలతో ఫేమస్ అవుతోంది. ఇంకా సినిమాలే మొదలే కాలేదు కాని కూతురు ఝన్వి కపూర్ అప్పుడే డేటింగ్లు - పార్టీలు అంటూ తెగ తిరుగుతోంది. స్టార్ కిడ్స్ ఎంట్రీలు కోసం వేచిచూస్తున్న బాలీవుడ్ కి ఈ అమ్మాయి ఎంట్రీ కోసం తెగ ఆరాటపడుతుండగా.. ఇప్పుడు ఝాన్వి తన బాయ్ ఫ్రెండ్ తో గొడవలు పడుతోందని.. దానికి ఒక హీరో తమ్ముడు కారణం అని టాక్.

ఝాన్వి కొద్ది కాలంగా తన ఫ్రెండ్ అక్షత్ రంజన్ తో డేటింగ్ చేస్తోందనే టాక్. కాకపోతే ఇప్పుడు వీళ్ళ డేటింగ్ అంతా సాఫీగా ఏమి సాగటం లేదు అని తెలుస్తుంది. దీనంతటికి కారణం షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ అని అంటున్నారు. ఇషాన్ - ఝాన్వి కలిసి ఇప్పుడు పార్టీలుకు పబ్ లకు తిరుగుతున్నారు అలానే చాల సోషల్ ఈవెంట్స్ కు కూడా కలిసే వెళ్ళుతున్నారు. ఇక సూపర్ హిట్ మరాఠీ సినిమా సైరాత్ హింది రీమేక్ లో ఇషాన్ అండ్ ఝాన్వి నటిస్తున్నారని ఒక పుకారు వచ్చింది. ఇషాన్ అండ్ ఝాన్వి దగ్గరకావడం అక్షత్ రంజన్ ఇష్టం లేదట. అందుకే అక్షత్ అండ్ ఝాన్వి కి మధ్య దూరం పెరుగుతుందని బాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి. వీళ్ళద్దరు మధ్య సంబంధం ఈ రీమేక్ సినిమా న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకరితో దగ్గరై దూరమై మరొకరికి దగ్గరై మంచి లవ్ హేట్ స్టోరీ ఒకటి క్రియేట్ చేసింది శ్రీదేవి కూతురు.

ఝాన్వి కపూర్ ఇప్పుడు తన సినిమా కోసం రెడీ అవుతుంటే ఇషాన్ ఖత్తర్ తన సినిమా ఎంట్రీ కోసం ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టేశాడు. ఇంటర్నేషనల్ డైరక్ట్ మజీద్ మాజీదీ డైరెక్ట్ చేస్తున్న ఒక సినిమాలో ఇషాన్ ఖత్తర్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/