Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ : ఫ్రెండ్స్ తో టీచర్ గేమ్

By:  Tupaki Desk   |   20 Jun 2019 7:04 AM GMT
టీజర్ టాక్ : ఫ్రెండ్స్ తో టీచర్ గేమ్
X
క్రైమ్ థ్రిల్లర్స్ కు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ దక్కుతున్న నేపధ్యంలో వస్తున్న మరో సినిమా అక్షర. నందిత శ్వేతా ప్రధాన పాత్రలో చిన్ని కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన ఈ మూవీ టీజర్ ఇందాక విడుదల చేశారు. కథ విషయానికి వస్తే ఆ ఊళ్ళో పిండి తాతాజీ(అజయ్ ఘోష్)బాగా ఫేమస్. అంటే అందరు ఎటకారం చేయడంలో అన్నమాట. ఇతనికో ముగ్గురు స్నేహితులు(మధు నందన్ - శకలక శంకర్ - సత్య). నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని జాలిగా గడిపేస్తూ ఉంటారు.

అప్పుడు వీళ్ళ జీవితంలోకి గిఫ్ట్ లా అడుగు పెడుతుంది టీచర్ అక్షర(నందితా శ్వేతా). ఏదో ఆశించిన వీళ్ళకు ఊహించని రీతిలో తన వల్ల పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సి రావడమే కాక ప్రమాదాల్లో ఇరుక్కుంటారు. ఇలా అయితే లాభం లేదని అక్షరను హత్య చేసేందుకు నిర్ణయించుకుని కిడ్నాప్ చేస్తారు. ఆ క్రమంలో ఆ అమ్మాయి వెనుక ఉన్న గతం ఒకటి తెలుస్తుంది. అప్పుడు కనువిప్పు కలిగి ఈ నలుగురిలో మార్పు వస్తుంది. అసలు ఆ యువతీ ఎవరు వీళ్ళ దగ్గరికే ఎందుకు వచ్చింది అనేదే అసలు పాయింట్

కథలో నావెల్టీ ఉంది. ఏదో కొత్తగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కొంత భాగం నలుగురు స్నేహితుల అల్లరితో సాగించి ఆ తర్వాత అక్షర పాత్రతో సీరియస్ గా మలుపు తిప్పి అటుపై ఏవో కొన్ని ఆసక్తికరమైన మలుపులని పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ తో ముడిపెట్టినట్టు ఉన్నారు. సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. నగేష్ బన్నేల్ ఛాయాగ్రహణం సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలు సబ్జెక్టుకు తగ్గట్టు ఉన్నాయి. సస్పెన్స్ ప్లస్ కామెడీని బాలన్స్ చేస్తూ సాగిన అక్షరలో ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కీలకంగా కనిపిస్తోంది. చిన్న కృష్ణ టేకింగ్ ఇంటరెస్టింగ్ గానే ఉంది. ఇంకా విడుదల తేది ఖరారు కావాల్సిన అక్షర మొదటి అడుగుని పూర్తి చేసేసింది