Begin typing your search above and press return to search.

ప్చ్‌.. హాటీకి ల‌క్ క‌లిసి రాలేదు!!

By:  Tupaki Desk   |   9 Oct 2019 1:30 AM GMT
ప్చ్‌.. హాటీకి ల‌క్ క‌లిసి రాలేదు!!
X
క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి చాలా మంది క‌థానాయిక‌లు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో టాప్ రేంజుకు ఎదిగారు. బెంగ‌ళూరు మంగుళూరు భామ‌లు ఎంద‌రో ఇక్క‌డ వెలిగారు. అనుష్క - ర‌ష్మిక మంద‌న బిగ్ రేంజులో స‌క్సెస‌య్యారు. సంజ‌న ఫ‌ర్వాలేద‌నిపించే మైలేజ్ ని ఎంజాయ్ చేసింది. సంజ‌న సోద‌రి నిక్కీ గ‌ర్లానీ త‌మిళంలో పాపుల‌రైంది. అలాగే న‌భా న‌టేష్ క‌న్న‌డ రంగం నుంచి వ‌చ్చి తెలుగు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది.

అయితే అదే చోటి నుంచి వ‌చ్చిన‌ ఈ అమ్మ‌డిని మాత్రం స‌రైన ఆఫర్ వ‌రించ‌డం లేదు ఎందుక‌నో. మ‌న్మ‌ధుడు 2 చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అక్ష‌ర గౌడ ఎందుక‌నో ఇంకా రెండో ఆఫ‌ర్ ని అందుకోలేక‌పోయింది. న‌టించిన తొలి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల క‌ళ్ల‌లో ప‌డినా ఎందుక‌నో ఈ అమ్మ‌డికి ల‌క్ మాత్రం ఫేవ‌ర్ కాలేదు.

బ‌హుశా.. అది డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ ఫ‌లితం వ‌ల్ల‌నే అయ్యి ఉండాలి. హిట్టొస్తే వ‌చ్చే జోష్ వేరు.. ఫ్లాపైతే దాని ఎఫెక్ట్ అంతే ఇదిగా ఉంటుంద‌న‌డానికి అక్ష‌ర గౌడ్ పెద్ద‌ ఎగ్జాంపుల్. అందానికి అందం.. హాట్ అప్పీల్ ఉన్నా మ‌రో అవ‌కాశం ద‌క్కించుకోవ‌డానికి ఇంకా ఎదురు చూడాల్సొస్తోంది. ఇక కేజీఎఫ్ లాంటి క్రేజీ చిత్రంతో బ‌రిలో దిగినా నిధి శెట్టి ప‌రిస్థితి ఇలానే రేసులో వెన‌క‌బ‌డిన సంగతి తెలిసిందే. నిధి శెట్టి విష‌యంలో హిట్టొచ్చినా ల‌క్ ఫేవ‌ర్ గా లేదెందుకో!