Begin typing your search above and press return to search.

బాలయ్య మిస్సయ్యాడు.. శర్వా ఇస్తాడా?

By:  Tupaki Desk   |   25 July 2016 2:34 PM GMT
బాలయ్య మిస్సయ్యాడు.. శర్వా ఇస్తాడా?
X
ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ కు.. కొందరి సినిమాల్లో నటించడం కారణంగా బ్రేక్ వచ్చేస్తుంటుంది. అయితే ఆ బ్రేకొచ్చే సినిమా ఏంటనేది ముందే ప్రూవ్ చేయడం చాలా కష్టం. టాలీవుడ్డులోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలో.. స్కిన్ షో అనేది నా డిక్షనరీలోనే లేదంటూ చాలా అవకాశాలు పోగొట్టేసుకుంది హీరోయిన్ అక్ష. కాని తరువాత కొన్ని సినిమాల్లో రయ్యిమని రాకెట్టులా రెచ్చిపోయినా కూడా.. అవకాశాలు అటకెక్కేశాయంతే.

ఈ ఏడాది స్టార్టింగులో ''డిక్టేటర్'' సినిమాతో తన అదృష్టాన్ని ఆఖరిసారిగా పరీక్షించుకుంది అక్ష. కాకపోతే ఆ సినిమాలో ఒక పాట కాదు కదా.. కనీసం ఏదన్నా మాంచి కమర్షియల్‌ సీన్ కూడా ఇవ్వలేదు. కేవలం నాలుగు సీన్లలో రెండు డైలాగులు మాత్రం చెప్పిందంతే. అదంతా వర్కవుటవ్వలేదులే. సినిమా కూడా ఫ్లాప్ కావడంతో మొత్తంగా అక్ష సీన్ రివర్స్ అయిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు శర్వానంద్ 25వ చిత్రంలో అమ్మడికి సెకండ్ హీరోయిన్‌ రోల్ ఇచ్చారట. కొత్త దర్శకుడు చంద్రమోహన్‌ తీస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్లో నటిస్తోంది.

మరి బాలయ్య ఇవ్వలేకపోయిన హిట్టు.. ఇప్పుడు శర్వానంద్ ఇస్తాడా? హిట్టు కాకపోయినా.. బ్రేక్ అయినా ఇస్తాడా??