ముగ్గురు హీరోలూ పచ్చడి తినిపిస్తారట

Tue Mar 13 2018 18:23:50 GMT+0530 (IST)

అక్కినేని వారి ఇంట హీరోలు ఈ ఉగాది నుంచి బాగా బిజీ అవ్వబోతున్నారు. తెలుగు సంవత్సరాదిన తమ కొత్త సినిమాల పనులతో పండుగ చేసుకోబోతున్నారు. నాగార్జునతో పాటూ ఇద్దరు కొడుకుల ఈ ఉగాది ఎంతో స్పెషల్ గా మారనుంది.నాగార్జున ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆఫీసర్ సినిమాటో నటిస్తున్నాడు. గత నెల రోజులకు పైగా ముంబైలోనే ఉంటూ... షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఛేజింగ్ సీన్లలో కూడా డూప్ లేకుండానే నాగ్‌తో పరుగులు పెట్టిస్తున్నాడట వర్మ. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఉగాది కల్లా హైదరాబాద్‌కు వచ్చేయనున్నాడు నాగ్. ఉగాది రోజున నానీతో కలిసి తాను చేయబోయే మల్టీస్టారర్ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేసి అనుకున్న సమయానికి విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్. ఇక నాగచైతన్య ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొత్త సినిమా ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న సవ్యసాచి సినిమా ఫస్ట్ లుక్‌ను ఉగాది రోజే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతోంది. సవ్యసాచిలో నాగచైతన్య లుక్ ఎలా ఉంటుందో ఉగాది రోజే తెలిసిపోతుంది.

ఒక చిన్న కొడుకు అఖిల్ రెండు డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్నాడు. అతనికో హిట్ ఇప్పడు తప్పనిసరిగా కావాలి. అతని మూడో సినిమా చేసే అవకాశం వెంకీ అట్లూరికి దక్కింది. తొలిప్రేమ సినిమాతో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు వెంకీ అట్లూరి. అఖిల్‌తో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తీయబోతున్నాడట. ఉగాది రోజున ఆ సినిమాను ఓకే చేయబోతోంది టీమ్. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ముగ్గురు అక్కినేని హీరోలకు ఈ ఉగాది స్పెషల్ గా మారనుంది. ముగ్గురు హీరోలూ మనకు ఉగాది పచ్చడి తినిపించి.. గుడ్ న్యూస్ చెబుతారు. గెట్ రెడీ.