Begin typing your search above and press return to search.

అక్కినేని కోడ‌లు ఆస్తి విలువ ఎంత‌?

By:  Tupaki Desk   |   12 Feb 2019 8:29 AM GMT
అక్కినేని కోడ‌లు ఆస్తి విలువ ఎంత‌?
X
అక్కినేని కోడ‌లు స‌మంత ఆస్తుల విలువ ఎంత‌? `ఏ మాయ చేశావే` చిత్రంతో క‌థానాయిక‌గా కెరీర్ ప్రారంభించి ఇప్ప‌టికే ఎనిమిదేళ్లు పూర్త‌య్యింది. 2021 నాటికి ద‌శాబ్ధం కెరీర్ ని పూర్త‌వుతుంది. సుమారు 50 సినిమాల‌కు చేరువ‌లో ఉన్నారు. సామ్ ప్ర‌స్తుతం తెలుగు - త‌మిళంలో క్రేజీ స్టార్. గ‌త ఏడాది నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడి అక్కినేని కోడ‌లు అయిన త‌ర్వాత త‌న బ్రాండ్ వ్యాల్యూ మ‌రింత పెరిగింది. ఇక‌ ఇన్నేళ్ల‌లో సామ్ సంపాద‌న ఎంత‌? సినిమాలు.. బ్రాండ్ ప్ర‌మోష‌న్స్.. ర‌క‌ర‌కాల‌ డీల్స్ రూపంలో ఏ మేర‌కు ఆర్జించారు? అన్న‌ది ప‌రిశీలిస్తే షాకిచ్చే నిజాలు తెలిశాయి. అక్కినేని కోడ‌లు స‌మంత ఇప్ప‌టివ‌ర‌కూ 100 కోట్ల మేర నిక‌ర ఆస్తుల్ని క‌లిగి ఉన్నారనేది ఓ అంచ‌నా.

అక్కినేని స‌మంత ఏడాదికి మినిమంగా మూడు నాలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు. ఒక్కో సినిమాకి 1.5- 2 కోట్ల మేర పారితోషికం అందుకుంటూ - బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ క‌లుపుకుని ఏడాదికి 6-10 కోట్ల మేర వార్షికాదాయం ఆర్జిస్తున్నారు. అలా ఇప్ప‌టికే 45 చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించారు. మ‌రో మూడు సినిమాలు అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ ఉన్నాయి. మ‌జిలీ త‌ర్వాత `ఓ బేబి: ఎంత స‌క్క‌గున్నావే` చిత్రంలో న‌టించ‌నున్నారు. దీంతో పాటు మ‌రిన్ని ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. ఓవ‌రాల్ గా సామ్ కెరీర్ బెస్ట్ ద‌శ‌లో ఉంది. మ‌రోవైపు ప‌లు కార్పొరెట్ ఉత్ప‌త్తుల బ్రాండ్ అంబాసిడ‌ర్ గానూ భారీగానే ఆర్జిస్తున్నారనేది అంచ‌నా.

హైద‌రాబాద్ లో సామ్ సొంత ఇంటి ఖ‌రీదు 10 కోట్లు. ఖ‌రీదైన కార్లు ఉన్నాయి. జాగ్వార్ ఎక్స్ఎఫ్ కార్ -62 ల‌క్ష‌లు - ఆడి క్యూ 7- 70ల‌క్ష‌లు - పోర్చ్ కార్ -1.15 కోట్లు. ఇంకా ఖ‌రీదైన అపార్ట్‌ మెంట్లు - విల్లాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. చాలా సార్లు ఇండస్ట్రీ అగ్ర నిర్మాత‌లు సామ్ కి పారితోషికానికి బ‌దులుగా అపార్ట్ మెంట్లు క‌ట్ట‌బెట్టార‌న్న ప్ర‌చారం సాగింది. ఇటీవ‌లే ల‌క్ష ఖ‌రీదైన ప్ర‌ముఖ బ్రాండ్ `చానెల్` మేక‌ప్ కిట్ ని సొంతం చేసుకున్నారు సామ్. త‌న వ్య‌క్తిగ‌త ప‌ని వాళ్ల‌కు వేలు - ల‌క్ష‌ల్లో పారితోషికాలు చెల్లిస్తున్నారు. ఓవ‌రాల్ గా సామ్ 100 కోట్ల ఆస్తుల‌కు అధిప‌తి అన్న‌ది ఓ అంచ‌నా. మెయింటెనెన్స్ - ప‌న్ను చెల్లింపులు - సేవ‌కుల జీతాల చెల్లింపులు - ప్ర‌త్యూష ఎన్జీవో సామాజిక సేవ‌లు వ‌గైరా ఖ‌ర్చులు లెస్ చేసినా ఈ స్థాయి ఉంటుంద‌నేది ఓ అంచ‌నా. డ‌బ్బు టు ద ప‌వ‌రాఫ్ డ‌బ్బు. డ‌బ్బు డ‌బ్బును పెడుతుంది. డ‌బ్బు డ‌బ్బును పెంచుతుంది అన్న సూత్రం ప్ర‌కారం ఈ ఆస్తుల విలువ మ‌రో ఐదారేళ్ల‌లోనే రెట్టింపు అవుతుంద‌న్న అంచ‌నా వేస్తున్నారు.