Begin typing your search above and press return to search.

రాంగ్ ట‌ర్న్ తీసుకుంటేనే ఎంట‌ర‌వుతా

By:  Tupaki Desk   |   5 Sep 2015 8:35 AM GMT
రాంగ్ ట‌ర్న్ తీసుకుంటేనే ఎంట‌ర‌వుతా
X
ఏఎన్నార్ న‌ట‌వార‌సుడిగా నాగార్జున ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చారు. ఇక్క‌డ కింగ్ అని నిరూపించుకున్నారు. కెరీర్ 90వ సినిమా సోగ్గాడే చిన్ని నాయ‌నాలో న‌టిస్తున్నాడిప్పుడు. మ‌రో ప‌ది సినిమాలు పూర్తి చేస్తే శ‌తాధిక చిత్రాల హీరోగా రికార్డుల్లోకెక్కిన‌ట్టే. అయితే కింగ్ న‌ట‌వారసులు ఇద్ద‌రు ప‌రిశ్ర‌మ‌లో ఎదిగే ప్ర‌ణాళిక‌లో ఉన్నారు ఇప్పుడు. పెద్ద కొడుకు నాగ‌చైత‌న్య కెరీర్ ఇప్పుడిప్పుడే జెట్ స్పీడ్ అందుకుంటోంది. ఇక చిన్న‌వాడైన అఖిల్ ఆరంగేట్ర సినిమా రిలీజ్‌ కి రెడీ అవుతోంది.

ప‌రిశ్ర‌మ‌లో ఏ తండ్రీ ప‌రిత‌పించ‌నంత‌గా నాగార్జున ఈ ఇద్ద‌రి కెరీర్‌ని తీర్చిదిద్దేందుకు ఎంతో శ్ర‌మిస్తున్నారు. ఇద్ద‌రు కొడుకుల్ని స్టార్ హీరోలుగా త‌యారు చేసేందుకు అత‌డు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదంటే అతిశ‌యోక్తి కాదు.. కోట్లాది రూపాయ‌ల‌తో బెట్టింగ్ ఇది. హీరో అయిపోవ‌డం, ఇక్క‌డ కెరీర్‌లో నిల‌దొక్కుకోవ‌డం అంటే ఇప్పుడున్న ఠ‌ఫ్ కాంపిటీష‌న్‌లో చాలా క‌ష్టం. అయినా కింగ్ మేధోత‌నంతో, చొర‌వ‌తో అవేవీ న‌ట‌వార‌సుల‌కు అడ్డంకి కాలేదు. అయినా కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్న‌ప్పుడు కొడుకుల విష‌యంలో కింగ్ ఏం చేస్తారో తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఏమ‌న్నారో తెలుసా?

నా కెరీర్ ప్రారంభంలో మాత్ర‌మే నాన్న‌గారు స‌ల‌హాలిచ్చారు. ఎప్పుడైనా నేను డైలెమాలో ఉన్న‌ప్పుడు స‌ల‌హా కోసం వెళ్లేవాడిని. నాగ‌చైత‌న్య‌, అఖిల్ న‌న్నుఏదైనా స‌ల‌హా అడిగితే.. అదే విధానాన్ని నా ఇద్ద‌రు కొడుకుల్ని పాటించ‌మ‌ని చెబుతుంటా. కెరీర్ రాంగ్ ట‌ర్న్ తీసుకున్న‌ప్పుడే నేను ఎంట‌ర‌వుతా. స‌రి చేస్తా. అంతే త‌ప్ప ప్ర‌తిదాంట్లో వేలు పెట్ట‌ను .. అని చెప్పారు నాగార్జున‌.