Begin typing your search above and press return to search.

ఒక అక్కినేని.. మూడు ఫస్ట్‌ లుక్‌ లు

By:  Tupaki Desk   |   29 Aug 2015 1:32 PM GMT
ఒక అక్కినేని.. మూడు ఫస్ట్‌ లుక్‌ లు
X
అక్కినేని లుక్కులే లుక్కులు! చూస్తుంటే ఈ సంవత్సరాన్ని అక్కినేని నామ సంవత్సరం అని పిలవాలేమో! ఎందుకంటే ఒకే ఏడాదిలో అక్కినేని హీరోలు నటించిన మూడు సినిమాలు రిలీజైపోతున్నాయి. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా', అఖిల్‌ సినిమా, నాగచైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజవుతున్నాయి. ఇప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ లు రిలీజైపోయాయి.

కింగ్‌ నాగార్జున ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ అదిరిపోయిందన్న టాక్‌ వచ్చింది. నాగ్‌ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పల్లెటూరి సోగ్గాడిలాగా పంచె కట్టుకట్టి చేత కర్రపట్టి బుల్లెట్టు మీద వెళుతూ మాబాగా కనిపించాడు. ఈ లుక్‌ లో కింగ్‌ అమేజింగ్‌. అలాగే అఖిల్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఇటీవలే రిలీజైంది. ఇందులో అతడు చాకులా కనిపించాడు. తండ్రిని మించిన తనయుడిగా టాలీవుడ్‌ లో కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని శాసించే సత్తా ఉన్న హీరోలా కనిపించాడు. ఎగ్రెస్సివ్‌ యంగ్‌ హీరోలా అఖిల్‌ కనిపించాడు. వినాయక్‌ దర్శకత్వంలో మరో మాస్‌ మసాలా యాక్షన్‌ సినిమా వస్తోందన్న సిగ్నల్స్‌ ఫస్ట్‌ లుక్‌ లో కనిపించాయి.

ఇప్పుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో' ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. ఇందులో చైతూని చూపించకపోయినా అతడి క్యారెక్టరైజేషన్‌ ని ఎలివేట్‌ చేసేలా ఓ బుల్లెట్టుని పోస్టరులో చూపించారు. దిశా గమ్యం లేని, అంతూ దరీ లేని ఓ బాటసారి సాహసమే ఈ సినిమా అనిపిస్తోంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించాడు. ఈ ఏడాది అక్కినేని హీరోలదే అనిపిస్తోంది ఈ లుక్‌ లు చూస్తుంటే.