ఫోటో స్టోరి: మనం అంతా కలిస్తే

Tue Jun 12 2018 09:42:40 GMT+0530 (IST)

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ బోలెడు మంది ఉన్నా కింగ్ నాగార్జున అండ్ అమల మాత్రం చాలా స్పెషల్. 26 ఏళ్ల క్రితం శివ సినిమా షూటింగ్ టైంలో వాళ్ల పెళ్లి సమయంలో ఎంత ప్రేమగా ఉన్నారో.. ఈనాటికి అంతకంటే రెట్టింపు ప్రేమ.. అన్యోన్యంగా ఉన్నారని చెప్పేయొచ్చు. ఒకరికొకరు తోడునీడగా ఈ జంట ప్రయాణం అందరికీ ఆనందం కలిగించేదే.తమ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య నాగ్ - అమల ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఆనందపు క్షణాలను వాళ్లిద్దరి తనయుడు - హీరో అఖిల్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘‘కుటుంబ సభ్యులందరితో లవ్ బర్డ్స్ సంతోషంగా గడిపారు. నేను ఎంతో ప్రేమించే మా అమ్మానాన్నలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎంత గొప్ప ప్రేమకథ’’ అంటూ అర్ధం వచ్చేలా అఖిల్ ట్వీట్ పెట్టాడు. అఖిల్ షేర్ చేసిన ఫొటోలో దాదాపుగా అక్కినేని కుటుంబం అంతా కనిపించింది. నాగచైతన్య - సుమంత్ - సుశాంత్ తో ఈ ప్రోగ్రాంకు అటెండై చిరునవ్వుతో ఫోజులిచ్చారు.

అఖిల్ షేర్ చేసిన ఈ ఫొటోను చూసి అభిమానులంతా చాలా హ్యాపీగా రిప్లయ్ లిచ్చారు. ఈ ఫొటోలో కనిపించిన ఒకే ఒక్క లోటల్లా అక్కినేని వారి కొత్త కోడలు సమంత లేకపోవడమేనని కామెంట్ చేశారు. సమంత ఎక్కడ అంటూ బోలెడు ప్రశ్నలే వచ్చాయి. సమంత ఉంటే ఇది 100 % పర్ ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్ అయ్యేది. అవును సమంతా.. నువ్వెక్కడ?