Begin typing your search above and press return to search.

ఖైదీ నెం.150 సెట్స్ లో అఖిల్ సందడి

By:  Tupaki Desk   |   30 Aug 2016 12:48 PM GMT
ఖైదీ నెం.150 సెట్స్ లో అఖిల్ సందడి
X
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150.. ఫుల్ పేస్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చిరు ఇలా రీఎంట్రీ ఇస్తుండడంపై చాలామంది చాలానే కామెంట్స్ చేశారు కానీ.. అందరిలోకి అక్కినేని అఖిల్ చేసిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా స్పెషల్. 'నేను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి కంగ్రాట్స్ చెబుతున్నా.. మెగాస్టార్ ఈజ్ బ్యాక్' అంటూ చిరు ఎదురుగా ఓ అవార్డ్ తీసుకుంటున్న సమయంలో అక్కినేని కుర్రాడు చేసిన కామంట్స్ ఎవరూ మర్చిపోలేరు.

చిరు రీఎంట్రీపై ఇండస్ట్రీకే శుభాకాంక్షలు చెప్పిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు మెగాస్టార్ మూవీ సెట్స్ లో సందడి చేశాడు. ఇలా ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కి అఖిల్ రావడానికి.. చిరంజీవిపై ఉన్న వీరాభిమానం ఒక కారణం అయితే.. మరోవైపు ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ కి అఖిల్ బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో రీజన్. వీటితోపాటు.. ఈ మెగా మూవీకి డైరెక్టర్ వివి వినాయక్ అనే విషయాన్ని స్పెషల్ గా చెప్పుకోవాలి. అక్కినేని అఖిల్ ని 'అఖిల్' మూవీతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసినది ఈ దర్శకుడే.

ఖైదీ నెంబర్ 150సెట్స్ కి వచ్చిన అఖిల్.. తన డైరెక్టర్ వినాయక్ తో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ సంగతులను ప్రొడక్షన్ యూనిట్ అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే.. చిరు సినిమా షూటింగ్ కి చాలామంది హీరోలు వస్తున్నారు కానీ.. మా పవన్ రావడం లేదంటూ.. అభిమానులు కామెంట్స్ చేసుకుంటున్నారు.