అఖిల్ కు ప్రపోజ్ చేసింది ఎవరంటే....

Mon Jul 17 2017 21:06:03 GMT+0530 (IST)

ఈ మధ్య అఖిల్ బుద్దిగా కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నాడు. పెళ్లి - ప్రేమ వ్యవహరాలకు నో అంటున్నాడు. దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. కార్తీకేయ - రాణా నిర్వహించే యారీ నంబర్ 1 షోకు గెస్ట్ గా వెళ్లిన అఖిల్ తన లవ్ ప్రపోజల్స్ గురించి ఇంటరెస్టింగ్ స్టోరీస్ చెప్పాడు. తన తొలి సినిమా నుంచి తాజా లవ్ ప్రపోజల్ వరకు అనేక విషయాలు పంచుకున్నాడు.

మొదట వీవీ వినాయక్ అఖిల్ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా ఉందనిపించిందటి. ఓ కొత్త హీరో చేయగల కథ ఇదే అని తాను నమ్మానని - అందుకే తొలిచిత్రంగా చేశానన్నాడు. కానీ ఆ సినిమా చేసేటప్పుడే తప్పు చేశాననని  అర్థమైందన్నాడు. నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని రాణా అడిగిన ప్రశ్నకు అఖిల్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఈ మధ్య విమానంలో హైదరాబాద్ నుంచి అబుదాబీకి వెళ్తున్నపుడు తాను నిద్ర పోయానని లేచి చూసే సరికి సీటు ముందు టీవీ స్క్రీన్ పైన ఓ నోట్ కనిపించిందని చెప్పాడు.

నువ్వు హాట్ గా ఉన్నావు సరే అంటే నేను రెడీ అని అందులో రాసి ఉందన్నాడు. నీకు లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు.. అబ్బాయి అని అక్కడి ఎయిర్ హోస్టెస్ జవాబివ్వడంతో తాను షాకయ్యానన్నాడు అఖిల్. ఆ ప్రపోజ్ చేసిన అబ్బాయి అక్కడే ఉండటంతో కొంత భయపడ్డానని చెప్పాడు. విమానం ఆగగానే అక్కడి నుంచి వేగంగా పరుగుతీసి తప్పించుకొన్నానని ఈ సరదా సంఘటనను అఖిల్ వివరించాడు.

ఈ కార్యక్రమానికి హీరో సుశాంత్ వచ్చి సర్ ప్రైజ్ చేశాడు. ఈ ప్రోగ్రాంలో అఖిల్ ను రానా - కార్తీకేయ ఆడుకున్నారు. నా ఇమేజ్ డామేజ్ చేయవద్దని అఖిల్ వారిద్దరిని కోరాడు. ఈ కార్యక్రమం చాలా ఆసక్తికరంగా సాగి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది.