Begin typing your search above and press return to search.

కొంపతీసి.. ఇది మూడో సినిమానా?

By:  Tupaki Desk   |   29 Aug 2015 4:45 PM GMT


హీరోగా అక్కినేని అఖిల్ ఫస్ట్ మూవీకి ఫస్ట్ లుక్ వచ్చేసింది. టీజర్ వచ్చేసింది. రెండింటిలోనూ మాస్ లుక్స్ తో అఖిల్ దుమ్ము రేపేశాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఫైర్ బాల్ చేతిలో ఉంటే... టీజర్ లో అయితే ఆ ఫైర్ బాల్ తానే అనిపించేశాడు అఖిల్. టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ నింపేయడం చూస్తే.. వివి వినాయక్ మార్క్ కనిపిస్తుంది. తను ఏం తీయాలనుకుంటున్నాడో... అఖిల్ ని ఎలా లాంఛ్ చేయానుకుంటున్నాడో.. సినిమాను ఏ స్టైల్లో తీస్తున్నాడో... 30సెకన్ల టీజర్ చెప్పేశాడు వినాయక్.

రింగులో ఫైటింగు తో మొదలుపెట్టి... రన్నింగ్‌ లు, వాటర్ లో స్మిమ్మింగ్‌లు, ఛేజింగ్‌లు, తర్వాత కార్‌పై జంపింగ్‌లు.. అబ్బా మాస్ హీరో ఎలా ఉంటాడో, ఎలా ఉంటాడో చూపించేశాడు అఖిల్. అసలు ఇది మొదటి సినిమాయేనా అనిపించేట్లుగా ఉన్నాయి మనోడి ఫీలింగ్స్, యాక్షన్. అదేంటి... ఇది మూడో సినిమాగా అంటారా? సిసింద్రీలో నటిస్తున్నట్లు అఖిల్ కే తెలీదు. మనంలో క్లైమాక్స్ సీన్ ఎండింగ్ లో ఓ లుక్ ఇచ్చాడు అంతే కదా.. అంతమాత్రాన వాటిని కూడా కలిపి లెక్కపెడతానంటే కుదరదు. ఎవరెన్ని చెప్పినా... అఖిల్ కి ఇదే ఫస్ట్ మూవీ అంతే. చూస్తుంటే అక్కినేని వంశంనుంచి ఫస్ట్ మాస్ స్టార్ట్ అయిపోయినట్లు కనిపిస్తోంది.