Begin typing your search above and press return to search.

కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్న అఖిల్

By:  Tupaki Desk   |   24 Nov 2015 10:14 AM GMT
కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్న అఖిల్
X
కొత్త హీరోకి తన లాంఛింగ్ మూవీ అంటే బాగా టెన్షన్ ఉంటుంది. జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. మరోవైపు ఫ్యాన్స్ నుంచి ఎక్స్ పెక్టేషన్స్ - ప్రెజర్ పెరిగిపోతూ ఉంటాయి. ఇన్నిటినీ అందుకుంటూ అరంగేట్రంలో హిట్ కొట్టడం కాస్త కష్టమైన విషయమే. అఖిల్ విషయంలోకూడా జరిగిందదే.

లాంఛింగ్ మూవీకి మామాలుగానే ఉన్న క్రేజ్ తో పాటు.. మరికొంత హైప్ ఎక్కువయిపోవడంతో దెబ్బపడిపోయింది. అయితే.. ఈ ఫ్లాప్ కారణంగా అఖిల్ తీవ్రంగా నిరాశ చెందాడని, డిప్రెషన్ కి గురైపోయాడని వార్తలొచ్చేస్తున్నాయి. అవన్నీ ఉత్తుత్తి కబుర్లే అని చెప్పే సంఘటన ఒకటి జరిగిందిపుడు. పెటా ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో అఖిల్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. కుక్కల పెంపకమంటే తనకు చాలా ఇష్టమంటూ.. బోలెడు కబుర్లు కూడా చెప్పాడు. ఇక కొత్త సినిమా విషయానికొస్తే.. కొన్ని స్క్రిప్టులు వింటున్నానని, ఇంకా ఫైనలైజ్ చేయలేదని చెప్పాడు అఖిల్. ఇదంతా చూస్తుంటే.. అఖిల్ త్వరగానే ఫ్లాప్ షాక్ నుంచి బయటపడ్డాడని అర్ధమవుతుంది. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్ర.. దాన్నే తలుచుకుంటూ కూర్చోవడం సరికాదనే విషయం అఖిల్ కి అర్ధమైనట్లుగానే ఉంది.

అసలు అఖిల్ వాలకం చూస్తుంటే... దాన్ని పెద్దగా పట్టించుకున్నట్లుగానే అనిపించడం లేదు. అంతుకమించి ఉత్సాహంగా కూడా కనిపించాడు. ఇప్పుడు కుర్రాడి మీద ఉన్న ఫస్ట్ మూవీ ప్రెజర్ తగ్గిపోవడంతో.. కొత్త ప్రాజెక్ట్ ని కాస్త లీజర్ గా చేసుకునే వెసులుబాటులు లభించింది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం క్రిష్ చెప్పిన ఓ కాన్సెప్ట్ ని అఖిల్ కోసం ఫైనల్ చేశారన్నది టాలీవుడ్ ఇన్నర్ టాక్. కానీ ఈ విషయంపై అఖిల్ నోరు మెదపడం లేదు.