Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: న్యూయెస్ట్ అక్కినేని.. వదిన

By:  Tupaki Desk   |   29 April 2017 8:32 AM GMT
ఫోటో స్టోరి: న్యూయెస్ట్ అక్కినేని.. వదిన
X
ఇప్పుడు హీరోయిన్ సమంత త్వరలోనే అక్కినేని ఫ్యామిలీ మెంబర్ గా కానున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే అక్కినేని నాగచైతన్యతో అమ్మడు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు పెళ్ళి డేట్ ఇంకా తెలియదు కాని.. ఈలోపు అక్కినేని యంగ్ కపుల్ ఇద్దరూ కలసి బాగానే పార్టీలు అవీ ఇస్తున్నారు.

మొన్న సమంత బర్తడే అనే సంగతి తెలిసిందే. ఆ రోజున హైదరాబాదులోని చైతూ అండ్ స్యామ్ కలసి ఉంటున్న ఫ్లాటులో ఒక పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మెయిన్ ఎట్రాక్షన్ ఎవరో తెలుసా? ఇంకెవరు చెయ్ తమ్ముడు అఖిల్ అనే చెప్పాలి. ఈ ఇద్దరి అన్నదమ్ములకు తల్లులు వేరైనా కూడా ఇద్దరి మధ్యనా అనుబంధం మాత్రం అద్భుతం. అందుకే తన అన్నయ్య అండ్ వదినతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చాడు అఖిల్. ''న్యూయెస్ట్ అక్కినేని ఇన్ ది టౌన్.. మై డార్లింగ్ వదిన సమంత పుట్టినరోజు పార్టీలో ఉన్నాను. ఐ లవ్ యు'' అంటూ తన అదిరే సెల్ఫీలను ట్వీట్ చేశాడు అఖిల్. చూస్తుంటే ఈ అక్కినేని ఫ్యామిలీ బాండింగ్ చాలా అందంగా ఉంది కదూ.

సినిమాల విషయానికొస్తే.. చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే.. సమంత గోదావరి జిల్లాల్లో రామ్ చరణ్‌ సినిమా షూటింగులో పాల్గొంటోంది. అలాగే అఖిల్ తన 2వ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/