ఫోటో స్టొరీ: బాయ్స్ విల్ బీ బాయ్స్

Sun Jan 13 2019 10:44:55 GMT+0530 (IST)

రామ్ చరణ్ సంక్రాంతి సినిమా 'వినయ విధేయ రామ' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రివ్యూలు.. మౌత్ టాక్ ఎలా ఉన్నా డే-1 కలెక్షన్స్ లో మాత్రం దుమ్ము దులిపేసింది.   ఇక ముందు ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో తెలీదు గానీ చరణ్ మాత్రం ఈ హంగామాకు.. దూరంగా వెకేషన్ కు వెళ్ళిపోయాడు.మంచుకొండల్లో అక్కినేని చినబాబు అఖిల్ తో కలిసి స్కీయింగ్ చేస్తూ ఫుల్ గా చిల్ ఆవుట్ అవుతున్నాడు.  చరణ్ వైఫ్ ఉపాసన ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ "బాయ్స్ విల్ బీ బాయ్స్.  #చరణ్ #అఖిల్.  యాక్షన్ సీన్స్ ఏవీ ప్రాక్టిస్ చేయడం లేదని అనుకుంటున్నా" అంటూ ఒక సూపర్ క్యాప్షన్ ఇచ్చింది.  ఇక చరణ్ అఖిల్ తో పాటుగా మరో ఇద్దరు స్నేహితులు కూడా ఆ ఫోటోలో ఉన్నారు.  అందరూ ఫుల్ గా జాకెట్లు.. గ్లవుజులు గట్రా వింటర్ వేర్ తో స్కీయింగ్ ప్రొఫెషనల్స్ లా కనిపిస్తున్నారు.

ఇప్పటివరకూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ సీక్వెల్స్ లు చేసి చేసి అలిసిపోయాడేమో అక్కినేని బాబు తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు అఖిల్ కూడా 'Mr. మజ్ను' షూటింగ్ ను పూర్తి చేశాడు.. ఈ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రమోషన్స్ మొదలు పెడతాడేమో.