Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ కోస‌మే ఎదురు చూపులు?

By:  Tupaki Desk   |   28 Nov 2015 5:08 AM GMT
త్రివిక్ర‌మ్ కోస‌మే ఎదురు చూపులు?
X
అక్కినేని అఖిల్ తెర‌పైకి మిసైల్‌ లా దూసుకొచ్చాడు. ఒక స్టార్‌ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకోవ‌డంలో తొలి ప్ర‌య‌త్నం స‌క్సెసయ్యాడు. మొద‌టి సినిమా అఖిల్ బాక్సాఫీస్ రిపోర్ట్ ప‌రంగా ఫెయిలైనా అఖిల్‌ లో విష‌యం ఉంది అన్న టాక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం అదొక్క‌టే అత‌డికి సంతృప్తినిచ్చే పాయింట్‌. అయితే ఇప్పుడు అఖిల్ దెబ్బ తిన్న పులిలా ఉన్నాడు. పంజా విసిరే పులిలా మోర‌లెత్తాడు. అందుకే తొలి ప్ర‌య‌త్నంలో చేసిన పొర‌పాటు మ‌లి ప్ర‌య‌త్నంలో ఉండ‌కూడ‌ద‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు.

త‌ను న‌టించే రెండో సినిమా కోసం ప‌క్కాగా ప్లాన్‌ తో మూవ్ అవుతున్నాడు. ఇప్ప‌టికే బోలెడుమంది ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని క్యూలో పెట్టుకున్నాడు. స్టార్ డైరెక్ట‌ర్ల‌తో మంత‌నాలు సాగిస్తున్నాడు. అయితే ఇందులోంచి ఫిల్ట‌ర్ చేసి ఎట్ట‌కేల‌కు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల్సిందే అని ఫిక్స‌యిపోయాడని తెలుస్తోంది. అత‌డి కోసం ఎంత‌కాల‌మైనా వేచి చూస్తాడట. త్రివిక్ర‌మ్‌ పై అఖిల్‌కి పూర్తి స్థాయిలో గురి ఉంది. నాగార్జున‌కి ఎంతో న‌మ్మ‌క‌స్తుడు త్రివిక్ర‌మ్‌. కాబట్టి ఇక రెండో సినిమాకి ఫిక్స‌యిన‌ట్టే. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం నితిన్ హీరోగా అ... ఆ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌య్యాక అఖిల్‌ తో సినిమా తెర‌కెక్కిస్తాడ‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే ఇటు అఖిల్‌ తో సినిమా తీయాల‌ని మెగా ప్రొడ్యూస‌ర్ డి.వి.వి.దాన‌య్య ఉవ్విళ్లూరుతున్నారు. త్రివిక్ర‌మ్‌ కి ఇప్ప‌టికే అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారు. కాబ‌ట్టి అఖిల్ -త్రివిక్ర‌మ్ -దాన‌య్య క‌ల‌యిక‌లో సినిమాకి స‌న్నాహాలు మొద‌లైన‌ట్టేన‌ని చెప్పుకుంటున్నారు. కాని త్రివిక్రమ్‌ తమిళ హీరో సూర్యతో కూడా ఒక సినిమాను కమిట్‌ అయినట్లున్నాడే. లెటజ్‌ సీ.