మజ్నుపై అవి రూమర్లు.. ఇది నిజం

Fri Jan 11 2019 11:23:37 GMT+0530 (IST)

అక్కినేని అఖిల్-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'Mr. మజ్ను'.  ఈ సినిమాపై వినిపించినన్ని వార్తలు రూమర్లు వేరే ఏ సినిమాకు కూడా వినిపించడం లేదు. మొదట్లో అఖిల్.. వెంకీ ల మధ్య గొడవలన్నారు. వారు నవ్వుకుంటూ ఒక వీడియో ద్వారా దానికి కౌంటర్ ఇచ్చారు.  ఇక లాస్ట్ ఇయర్ జులై లోనే సగభాగం షూటింగ్ పూర్తయిందని డిసెంబర్ కు పక్కా రిలీజ్ అన్నారు. కానీ జనవరి కి వెళ్ళింది. మళ్ళీ ఫిబ్రవరి అన్నారు. ఫైనల్ గా జనవరి 25 కు ఫిక్స్ అయింది.ఇదిలా ఉంటే గత రెండువారాలుగా మరో రూమర్ వినిపిస్తోంది. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని.. కానీ నాగార్జున కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో రీషూట్స్ చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ పక్కనబెడదాం.  తాజా సమాచారం ఏంటంటే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.  ఒక్క రోజు షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది.  ఈ వన్ డే షూట్ పూర్తయితే  సినిమాకు గుమ్మడికాయ కొడతారని అంటున్నారు. సినిమా విడుదలకు రెండు వారాలే సమయం ఉంది కాబట్టి ఇక ప్రమోషన్స్ లో కూడా జోరు పెంచుతారట.

అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దీంతో 'తొలిప్రేమ' లాంటి యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన డైరెక్టర్ వెంకీ అట్లూరితో జట్టు కట్టాడు. మరి ఈ సినిమాతోనైనా అక్కినేని చినబాబుకు విజయం దక్కుతుందేమో వేచి చూడాలి.