Begin typing your search above and press return to search.

అఖిల్ అప్‌ సెట్ అయ్యాడా?

By:  Tupaki Desk   |   5 May 2016 5:04 AM GMT
అఖిల్ అప్‌ సెట్ అయ్యాడా?
X
అక్కినేని క‌థానాయ‌కులు ఒప్పుకోవాలి కానీ... సినిమాలు తీయ‌డానికి నిర్మాత‌లు క్యూ క‌డ‌తారు. స‌క్సెస్ ఫెయిల్యూర్ల‌ని అస్స‌లు ప‌రిగ‌ణ‌న‌లోకే తీసుకోరు. అలాంటిది అఖిల్ సినిమా విష‌యంలో మాత్రం అందుకు భిన్న‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న తొలి సినిమా ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది కాబ‌ట్టి రెండో సినిమా విష‌యంలో నిర్మాత‌లు అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని, మ‌హేష్‌ తో సినిమా తీసిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ చివ‌రి నిమిషంలో వెన‌క్కి త‌గ్గింద‌ని వార్తలొచ్చాయి. ఆ వార్త‌లని చూసిన అఖిల్ అప్ సెట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

అస‌లు అలాంటి ఇన్ఫ‌ర్మేష‌న్ వెబ్‌సైట్ల‌కి ఎక్క‌డ్నుంచి వ‌స్తుంది, అవ‌న్నీ అబ‌ద్ధాలే. అస‌లు ఇప్ప‌ట్లో మైత్రీ మూవీస్‌ లో సినిమా చేసే ఆలోచ‌నే మాకు లేదని అఖిల్ ట్వీట్ చేశాడు. అస‌లే తొలి సినిమా ఫ‌లితం తేడా వ‌చ్చింద‌ని అఖిల్ డీలా ప‌డిపోయాడు. రెండో సినిమా విష‌యంలో అలా జ‌ర‌క్కూడ‌ద‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో.. ఆచి తూచి అడుగులేస్తున్నాడు. అలాంటి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ నెగిటివ్‌గా ఇలాంటి వార్త‌లొస్తే ఎవ‌రైనా అప్‌ సెట్ అవుతారు. అఖిల్‌ ది కూడా ఇప్పుడు అదే ప‌రిస్థితి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ న‌టించ‌నున్న రెండో చిత్రం ఓ ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌థ‌ - క‌థ‌నాలు ప‌క్కా అయిపోయిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని పీవీపీ నిర్మించే అవ‌కాశాలున్న‌ట్టు తెలిసింది. ఊపిరితో పీవీపీకి మంచి రిజ‌ల్ట్ వ‌చ్చింది. వంశీపై ప్ర‌సాద్‌.వి పొట్లూరి ఇప్పుడు చాలా న‌మ్మ‌కంగా వున్నారు. అందుకే ఆ కాంబినేష‌న్ సెట్ట‌యిన‌ట్టు తెలిసింది.