రికార్డ్స్ బద్దలవుతూనే ఉంటాయ్ -అఖిల్

Wed Jan 11 2017 18:21:52 GMT+0530 (IST)

మెగా ఫ్యామిలీ అండ్ అక్కినేని ఫ్యామిలీ అనుబంధం ఏదో జస్ట్ సినిమా వాళ్ళం అన్న కామన్ ఫ్యాక్టరే కాదు.. వారు బిజినెస్ పార్టనర్లు కూడా. అందుకే చాలాసార్లు మెగాస్టార్ చిరంజీవి అండ్ అక్కినేని నాగార్జున కలసి మాంచి జాయింట్ ఎప్పీయరెన్సులు ఇస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ అండ్ అఖిల్ మధ్యన కూడా అలాంటి ఒక మాంచి రిలేషన్ ఉందా అంటే.. అంతకంటే ఎక్కువే అని చెప్పాలి.

''రికార్డ్స్ ఆల్రెడీ బద్దలయ్యాయ్.. ఇంకా బద్దలవుతూనే ఉంటాయ్. ఒక సూపర్ స్టార్ ను రీ-లాంచ్ చేయడం అనే విషయం మనం తొలిసారిగా చూస్తున్నాం. అదే స్టార్ పవర్ అంటే. మెగాస్టార్ చిరంజీవి అంటే'' అంటూ ట్వీట్ చేశాడు యంగ్ హీరో అఖిల్. మనోడు హీరో రామ్ చరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్. అందుకే ఆ మధ్యన ఖైదీ నెం 150 సెట్స్ కు కూడా విచ్చేశాడు. అఖిల్ ను అందుకే రోలింగ్ టైటిల్స్ దగ్గర వేసే మేకింగ్ వీడియోలో కూడా చూపెట్టారు. అయితే మెగాస్టార్ కంబ్యాక్ పట్ల తనకున్న ఫీలింగ్స్ ఏంటనేది ఇలా రికార్డ్స్ ట్వీట్ తో చెప్పేశాడు అఖిల్.

ఇకపోతే ''చిరంజీవి గారూ ఖైదీ నెం 150 మీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా'' అంటూ ఇప్పటికే కింగ్ నాగార్జున కూడా ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/