Begin typing your search above and press return to search.

అఖిల్-3.. అందరూ అనుకున్నదే

By:  Tupaki Desk   |   18 March 2018 7:41 AM GMT
అఖిల్-3.. అందరూ అనుకున్నదే
X
తన తొలి రెండు సినిమాలను ఖరారు చేసే ముందు చాలా కసరత్తులు చేశాడు అక్కినేని అఖిల్. ఐతే పరిపరి విధాల ఆలోచించి.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసిన ఆ రెండు సినిమాలూ అతడికి నిరాశనే మిగిల్చాయి. మూడో సినిమా విషయంలో కూడా ఇలాగే చేసేలా కనిపించాడు అక్కినేని కథానాయకుడు. ముందు సత్యప్రభాస్ పినిశెట్టితో సినిమా దాదాపుగా ఓకే చేసి.. ఉన్నట్లుండి ఆ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యాడు. ఆ తర్వాత అఖిల్ తర్వాతి సినిమా దర్శకుడంటూ రకరకాల పేర్లు వినిపించాయి. ఐతే ఈ విషయంలో మరీ నాన్చకుండా త్వరగానే సంగతి తేల్చేశాడు అఖిల్.

గత నెలలోనే ‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరితో తన తర్వాతి సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు అఖిల్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ప్రాజెక్టు గురించి ఈ రోజు అఖిల్ స్వయంగా ప్రకటన చేశాడు. తాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించబోతున్నానని.. ఈ చిత్రాన్ని ‘తొలి ప్రేమ’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాదే ప్రొడ్యూస్ చేస్తాడని అతను ట్విట్టర్లో వెల్లడించాడు. ఈ చిత్రం మేలో సెట్స్ మీదికి వెళ్తుందని కూడా అఖిల్ తెలిపాడు. ఈ నెల 26న అఖిల్-వెంకీ సినిమాకు ముహూర్త కార్యక్రమం జరపనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి లొకేషన్ల వేట కోసమే అఖిల్.. వెంకీ బ్యాంకాక్ లో పర్యటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఇంకా కథానాయిక ఖరారవ్వలేదు.