Begin typing your search above and press return to search.

అఖిల్ టైటిల్ ట్యాగ్ లైన్ అర్ధం ఏమిటి?

By:  Tupaki Desk   |   28 Aug 2015 10:28 AM GMT
అఖిల్ టైటిల్ ట్యాగ్ లైన్ అర్ధం ఏమిటి?
X
అక్కినేని ప్రిన్స్ మొదటి సినిమా "అఖిల్" పోస్టర్ విడుదల చేశాడు నిర్మాత కం హీరో నితిన్! ఈ ఫస్ట్ లుక్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ మేరకు సోషల్ నెట్ వర్క్ తో పాటు మీడియా మొత్తం ఈ లుక్ హాట్ టాపి అయ్యింది. ఇదే క్రమంలో నాగార్జున కూడా తన సంతొషాన్ని వ్యక్తం చేశారు. వివి వినాయక్.. అఖిల్ ను ఎలా చూపించబోతున్నాడొ అనే విషయంపై అక్కినేని అభిమానులకు ఒక క్లారిటీ రావడంతో పాటు.. సినిమాపై అంచనాలు కూడా బాగా పెంచేసుకుంటున్నారు.

ఈ క్రమంలో అఖిల్ టైటిల్ కింద ట్యాగ్ లైన్ గమనిస్తే... "ది పవర్ ఆఫ్ జువా" అని ఉంది. దీనికి అర్ధం తెలియక తెగ జుట్టు పీకేసుకుంటున్నారట కొంతమంది సినీ జనం! ఈ మేరకు గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నా... అర్ధం దొరక్క తెగ ఇబ్బంది పడుతున్నరట. ఈ క్రమలో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి నితిన్ వరకూ చేరడంతో నిర్మాత నితిన్ క్లారిటీ ఇచ్చాడట!

ఆఫ్రికాలోని స్వాహిలీ బాషలో జువా అంటే... సూర్యుడు అని అర్ధమట. అందుకే "ది పవర్ ఆఫ్ జువా" అని ట్యాగ్ లైన్ పెట్టారట. అంటే... అఖిల్ - సూర్యుడి శక్తి అని అర్ధం అన్నమాట!! దీన్ని బట్టి కథ చాలా వరకూ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఉండబొతుందని ఒక అంచనాకి వచ్చేస్తున్నారు అభిమానులు! ఏది ఏమైనా... వినాయక్ - అఖిల్ - నితిన్ లు కలిసి రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తున్నట్లే ఉన్నారు!