Begin typing your search above and press return to search.

స్పాటెడ్: అఖిల్ విత్ గాళ్ ఫ్రెండ్

By:  Tupaki Desk   |   27 Aug 2016 6:25 AM GMT
స్పాటెడ్: అఖిల్ విత్ గాళ్ ఫ్రెండ్
X
ఇంతకీ అఖిల్ గాళ్‌ ఫ్రెండ్ ఎవరు? ఇప్పటికే అనే మ్యాగజైన్లలో న్యూస్ పేపర్లలో వినిపిస్తున్న దాని ప్రకారం.. ప్రముఖ వ్యాపారవేత్త జీవికె గ్రూపు అధినేత జీవికె కూతురు కూతురైన శ్రీయ భూపాల్ మనోడి లవర్ అని తెలుస్తోంది. దానికి తోడు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు.. ఉదాహరణకు జీవికె మనుమడు జీవికె జూనియర్.. అలాగే చరణ్‌ వైఫ్‌ ఉపాసన కామినేని.. వీరందరూ మాట్లాడితే అఖిల్ అండ్ శ్రీయ ను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో చాలా పోస్టులు చేస్తుంటే.. అంతకంటే కన్ఫర్మేషన్ ఏం కావాలి?

ఇకపోతే గత రాత్రి జరిగిన ఒక ప్రైవేట్ పార్టీలో అఖిల్ ఈ సో కాల్డ్ ఫ్యాషన్ డిజైనర్ శ్రీయ భూపాల్ తో కలసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇదే పార్టీకు సినిమా యాక్ట్రెస్ లక్ష్మీ మంచు.. ఫ్యాషన్ డిజైనర్ కమ్ కింగ్ ఫిషర్ మోడల్ శిల్పా రెడ్డి.. తదితరులు కూడా అటెండ్ అయ్యారు. అక్కడ చూడండి.. అఖిల్ తన గాళ్‌ ఫ్రెండ్ శ్రీయతో పాటు.. ఈ ఇద్దరితో కూడా కలసి ఒక ఫోటోకు ఫోజిచ్చాడు. అయితే ఈ ఫోటో ఎక్కడ తీశారనేగా మీ సందేహం? నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి.. ఎంపి అండ్ బిజినెస్ మ్యాన్ టి.సుబ్బిరామి రెడ్డి చెల్లెలు కొడుకుని వివాహం చేసుకుంది. ఆ పార్టీలో తీసిందే ఈ స్నాప్.