Mr.మజ్నుగారి సిక్స్ ప్యాక్ లుక్ అదిరిందే

Tue Jan 22 2019 18:59:39 GMT+0530 (IST)

అక్కినేని అఖిల్ నటించిన 'Mr.మజ్ను' జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ వీడియో ప్రోమోను విడుదల చేశారు.  ఒక నిముషం నిడివి ఉండే ఈ వీడియోలో అఖిల్ తన ఫ్యామిలీ లెగసీని గుర్తు చేస్తూనే.. డ్యాన్సింగ్ కూడా దుమ్ములేపాడు.



కానీ ఈ ప్రోమోలో అన్నిటికంటే ఆకట్టుకునే అంశం చినబాబు సిక్స్ ప్యాక్ అవతారం.  ఇప్పటికే టాలీవుడ్ హీరోలు చాలామంది సిక్స్ ప్యాక్ లుక్ లో దర్శనమిచ్చినా.. అఖిల్ సిక్స్ ప్యాక్ డిఫరెంట్.  'ధూమ్ 2' సినిమాలో 'దిల్ లగా న' సాంగ్ లో హృతిక్ రోషన్ వేసుకునే స్టైల్ షర్టు వేసుకుని మరీ సిక్స్ ప్యాక్ ప్రదర్శిస్తూ స్టెప్పులేశాడు.  థమన్ ఇచ్చిన మంచి ట్యూన్ కు తగ్గట్టే డ్యాన్స్ కూడా సెట్ అయింది. విజువల్స్ కూడా చక్కగా కుదిరాయి.

ఇప్పటికే 'కోపంగా కోపంగా' పాటతో మెప్పించిన 'Mr. మజ్ను' టీమ్ టైటిల్ సాంగ్ ప్రోమోతో కూడా మంచి మార్కులు కొట్టేసింది. సినిమా ఎలా ఉందో రిలీజ్ తర్వాతే తెలుస్తుంది కానీ థమన్ మ్యూజిక్ మాత్రం సినిమాలో ఒక హైలైట్ గా ఉండబోతోందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు.