అఖిల్ సస్పెన్స్ ఆ రోజు తెలుస్తుంది

Sun Aug 13 2017 11:16:19 GMT+0530 (IST)

జున్ను. ఎక్కడ ఎక్కడ ఉందో తారక. రంగుల రాట్నం. ఇలా చాలా టైటిల్స్ విన్నాం. ఇవన్నీ కూడా ఒకే సినిమాకు సంబంధించినవే. అవును.. అఖిల్ హీరోగా విక్రమ్ కె కుమార్ డైరక్షన్లో రూపొందుతున్న సినిమా కోసం ఈ పేర్లన్నీ వినిపించాయ్. ఇంతకీ వీటిల్లో ఏది కరక్ట్? నిజంగానే వీటిల్లో ఒకటి పిక్ చేశారా? వీటన్నింటినీ అన్నపూర్ణ స్టూడియో రిజిస్టర్ చేయించిన మాట అయితే వాస్తవమే.డిసెంబర్ 22న ఈ సినిమా రిలీజ్ చేయడానికి కూడా ఆల్రెడీ రంగం సిద్దం చేస్తున్నారు నాగార్జున. ఆయనకు అచ్చొచ్చిన డిసెంబర్ లోనే కొడుకుకు కూడా కలిసొస్తుందని ఆయన ఆశ. అయితే సినిమాను డైరక్టర్ చేస్తుంది విక్రమ్ కె కుమార్ కాబట్టి.. ఖచ్చితంగా అందులో కొత్తగా ఏదో ఉంటుందనేది అందరి నమ్మకం. ఇకపోతే ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఊహాగానాలకు ఆయన తెరదించేయనున్నారట. ఆగస్టు 29 నాగార్జున బర్త్ డే సందర్బంగా ఆ రోజు ఫస్ట్ లుక్ కాని.. టైటిల్ లుక్ కాని రిలీజ్ చేస్తారట.

తన తొలిసినిమా అఖిల్ డిజాష్టర్ అయిపోయిన తరువాత.. అఖిల్ కూడా చాలా గ్యాప్ తీసుకుని చాలెంజింగ్ గా ఈ సినిమాను చేస్తున్నాడు. అలాగే దర్శకుడు విక్రమ్.. సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ కూడా సినిమాను చాలా ప్యాషనేట్ తీస్తున్నారని.. మొన్నామధ్యన ఫుటేజ్ చూసిన నాగ్ చెప్పారు.