Begin typing your search above and press return to search.

అఖిల్ కు ఆ ఇద్దరూ అడ్డుపడతారా?

By:  Tupaki Desk   |   20 Aug 2017 5:31 AM GMT
అఖిల్ కు ఆ ఇద్దరూ అడ్డుపడతారా?
X
'అఖిల్' సినిమాతో ఊహించని డిజాస్టర్ ని అందుకున్న అక్కినేని అఖిల్ రెండవ సినిమాతో అయినా ప్రేక్షకులను థ్రిల్ చేసి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ని రిలీజ్ తో ఆకట్టుకున్న ఈ హీరో త్వరలో టైటిల్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాడు. అందుకు నాగార్జున "హలో గురు ప్రేమకోసమేరోయ్ జీవితం'' అనే పాటలో టైటిల్ ఉందంటూ క్లూ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.

అయితే అసలు విషయంలోకి వస్తే అఖిల్ రెండవ సినిమా క్రిస్టమస్ సెలవుల్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసాడట హీరో నాగార్జున. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా క్రిస్టమస్ కి రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. నాగార్జున కూడా సెంటిమెంట్ గా భావించి డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు. అయితే ఆ మూమెంట్ లొనే నాని 'ఎంసీఏ' కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. అసలే నాని నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఓ వైపు ఫ్యామిలీ ఆడియెన్స్ మరో వైపు యూత్ కూడా నాని సినిమాలకి అలవాటు పడిపోయారు. ప్రొడ్యూసర్స్ కి బయ్యర్స్ కి కూడా నాని మినిమమ్ గ్యారెంటీ కలెక్షన్స్ రాబట్టే హీరో అయ్యాడు. మరి ఈ స్థాయిలో ఉన్న నానిని ఎదుర్కోవాలంటే అఖిల్ కి చాలా కష్టమనే చెప్పాలి. కానీ దిల్ రాజు కి అక్కినేని ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉండడంతో ఎంసీఏ ను అఖిల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారానికి అంటే డిసెంబర్ 29 కి రిలీజ్ చేసే అవకాశం ఉండవచ్చు అనుకుంటే.. ఇప్పుడు మాత్రం 21నే అని వీరు కూడా ప్రకటించేశారు.

ఇక నాని సంగతి పక్కన పెడితే అఖిల్ మరో సినిమాను గట్టిగానే ఎదుర్కోవాలి. సౌత్ లో లేడి సూపర్ స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క "బాగమతి" అప్పుడే రాబోతుంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఆ సినిమాను పిల్ల జమిందార్ దర్శకుడు అశోక్ తెరకెక్కిస్తున్నాడు. హిస్టారికల్ మూవీ గా వస్తున్న ఆ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి అఖిల్ సినిమాకు జేజెమ్మ అండ్ నాని కలిపి అడ్డుపడితే ట్రేడ్ వైజ్ కాస్త కష్టంగానే ఉంటుంది. ఆల్రెడీ ఆగస్టు 11న చూశాంగా ఏం జరిగిందో!!