Begin typing your search above and press return to search.

మళ్ళీ రిపీట్ చేస్తున్న అక్కినేని హీరో

By:  Tupaki Desk   |   15 Sep 2019 6:24 AM GMT
మళ్ళీ రిపీట్ చేస్తున్న అక్కినేని హీరో
X
బొమ్మరిల్లు భాస్కర్ తో తన నాలుగో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఇటివలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. అఖిల్ కోసం కొంతమంది హీరోయిన్స్ ని ఆడిషన్ చేసి ఫైనల్ గా పూజను ఫైనల్ చేసుకున్నారు మేకర్స్. అయితే సోషల్ మీడియాలో వీరిద్దరి పెయిర్ కి నేగిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి. అఖిల్ సరసన పూజా హెగ్డే సూట్ అవుతుందా ? అనే డౌట్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. అయితే అఖిల్ పక్కన పూజా హీరోయిన్ గా పర్ఫెక్ట్ అనుకున్నారట మేకర్స్. ఇద్దరినీ పెట్టి ఓ ఫోటో షూట్ కూడా చేసాకే డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.

ఇవన్నీ పక్కన పెడితే అఖిల్ మరోసారి తన అన్నయ్య హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నాడు. మొన్నీ మధ్య నాగ చైతన్య తో కలిసి సినిమా చేసిన నిధి అగర్వాల్ తో 'మజ్ను' లో జత కట్టిన అఖిల్ ఇప్పుడు చైతూ తో 'ఒక లైలా కోసం' సినిమా చేసిన పూజాతో రోమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు.

నిజానికి 'ఒక లైలా కోసం' రిలీజ్ టైంలో కూడా చైతూ పక్కన పూజా మరి పెద్దగా కనిపించింది అనే కామెంట్ అందుకుంది. మరి ఇప్పుడు అఖిల్ పక్కన సినిమాలో ఎలా ఉంటుందో , వీరిద్దరి పెయిర్ కి ఎలాంటి మార్క్స్ పడతయో చూడాలి. బన్నీ వాస్ - వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.