Begin typing your search above and press return to search.

ఇవన్నీ బాగానే ఉన్నాయ్ అఖిల్

By:  Tupaki Desk   |   24 Aug 2016 3:30 PM GMT
ఇవన్నీ బాగానే ఉన్నాయ్ అఖిల్
X
గత ఏడాది దసరా సీజన్లో ''అఖిల్‌'' సినిమాతో విచ్చేశాడు అక్కినేని యువకిశోరం. ఆ సినిమా భారీగా దెబ్బేయడంతో ఇప్పటివరకు మనోడు తన రెండవ సినిమా ఏంటనేది కన్ఫామ్ చేయలేదు. అందరూ ఇప్పుడు ఆతృతగా ఎదురుచూస్తోంది ఆ సినిమా గురించే.

అయితే తన రెండో సినిమా గురించి ఒక్కమాట కూడా చెప్పని అఖిల్.. ఇతర స్టార్ల సినిమాలను ప్రమోట్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటున్నాడు. అదిగో చూడండి.. మొన్నటికి మొన్న పెళ్ళిచూపులు సినిమాను ప్రమోట్ చేయడానికి ఒక సక్సెస్ మీట్ కు వచ్చాడు. దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. తరువాత మనోడు ఇతర సినిమాల ఓపెనింగులకు కూడా విచ్చేశాడు. ఇప్పుడు తాజాగా 100 డేస్ ఆఫ్‌ లవ్ అంటూ వస్తున్న నిత్యా మీనన్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ కు విచ్చేశాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయ్.. ఇంతకీ నీ సినిమా ఎప్పుడు అఖిల్?

హను రాఘవపూడి సినిమా క్యాన్సిల్ అయిన తరువాత.. ఇప్పుడు మనం ఫేం విక్రమ్ కుమార్ తో అఖిల్ తన తదుపరి సినిమా చేస్తాడని రూమర్లు వినిపిస్తున్నాయి.