Begin typing your search above and press return to search.

ఆ విషయంలో అఖిల్‌ కష్టపడ్డాడట

By:  Tupaki Desk   |   13 Oct 2015 7:30 PM GMT
ఆ విషయంలో అఖిల్‌ కష్టపడ్డాడట
X
సాధారణంగా కొత్త హీరోతో సినిమా చేయడమంటే కష్టమైన విషయం. అదే స్టార్ హీరో వారసుడిని ఇంట్రడ్యూస్ చేయడమంటే.. అది పెద్ద బాధ్యత. దీనికి చాలా గట్స్ ఉండాలి. దర్శకుడికైనా, నిర్మాతకైనా ఈ వ్యవహారం రిస్కీనే. కానీ అఖిల్ విషయంలో ఇలాంటి కష్టం అవసరం లేకపోయింది. హీరోగా అరంగేట్రం చేస్తానని అక్కినేని వారసుడికి ముందునుంచే తెలుసు. అందుకే అన్ని విషయాలో ట్రైనప్ అయిపోయాడు. ఫైట్లు - డ్యాన్స్ లు - యాక్షన్ లో ఆరితేరిపోయాడు. దీంతో మూవీ తీసేందుకు దర్శకుడికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేకపోయింది. క్వాలిటీ ని పట్టించుకోనవసరం లేకుండా... అంతకుమించి పర్ఫెక్షనిజంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది.

అయినా సరే.. అఖిల్ యూనిట్ కి ఓ విషయంలో తిప్పలు తప్పలేదు. అదే టైటిల్. ఈ మూవీకి ఏ పేరు పెట్టాలి? సినిమా స్టార్టింగ్ నుంచి ఇదే అతి పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిందట. అఖిల్ అనే పేరును కూడా... పోస్టర్ ని రిలీజ్ చేసే ముందురోజే ఫైనల్ చేశారట. అఖిల్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. 500 టైటిల్స్ షుమారు అనుకుని చివరికి ''అఖిల్''కి మొగ్గు చూపామని.. తను - డైరెక్టర్ - ప్రొడ్యూసర్ ఈ విషయంపై రోజూ చర్చించుకోవడం కొంత ఇబ్బందిగా అనిపించేదని అంటున్నాడు అఖిల్.

నిజానికి అఖిల్.. ది పవర్ ఆఫ్ జువా అని ప్రకటించేందుకు ముందు.. మిసైల్ - పవర్ - రుస్తుం - సుప్రీం.. ఇలా అనేక పేర్లు చర్చలోకి వచ్చాయి. వార్తల్లో నానాయి. మిస్సైల్ అయితే ఫిక్స్ చేసేశారనే టాక్ వినిపించింది. రుస్తుం - సుప్రీం పేర్లను కూడా గట్టిగానే పరిశీలించినా... ఈ టైటిల్స్ మెగాస్టార్ ని గుర్తు తెచ్చేవిగా ఉండడంతో.. వెనక్కు తగ్గారు. చివరకు అఖిల్ కే మొగ్గు చూపారు. పేరు తగ్గట్టుగానే అఖిల్ పవర్ ఫుల్ గా ఉంటుందని చెబ్తున్నాడు అక్కినేని యవకిశోరం. అక్టోబర్‌ 22న దూసుకొస్తున్నాడు మరి.