Begin typing your search above and press return to search.

అఖిల్ మళ్లి రిస్క్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   23 March 2019 3:30 PM GMT
అఖిల్ మళ్లి రిస్క్ చేస్తున్నాడా?
X
అక్కినేని లాంటి ప్రతిష్టాత్మక సినీ కుటుంబం నుంచి వచ్చిన హీరోగా అఖిల్ ముచ్చటగా మూడు లాంచులు పూర్తి చేసుకున్నాడు. ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. విడుదల ముందు వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్యారీ చేసిన మిస్టర్ మజ్ను సైతం అదే కోవలోకి వెళ్ళడం అభిమానులు ఇప్పట్లో మర్చిపోయేలా లేరు. ఇప్పుడు నాలుగో సినిమా వంతు వచ్చింది.

ఇప్పటిదాకా చేసిన మూడు సినిమాలకు పని చేసిన దర్శకులు ఆ సమయానికి పీక్స్ లో ఉన్నవాళ్ళే. వివి వినాయక్ తో డెబ్యు చేసినప్పుడు అతనికి మంచి డిమాండ్ ఉంది. మినిమం గ్యారెంటీ దర్శకుడిగా ఉన్న పేరు ఫాంటసీ కథాంశం ఇవేవి అఖిల్ కు సహాయపడలేదు. ఇక హలోకు చేసిన విక్రం కుమార్ ట్రాక్ రికార్డు అందరికి తెలిసిందే. ఇష్క్ మనం నుంచి 24 దాకా తన విలక్షణతను చాటుకుంటూనే వచ్చాడు ఇక మొదటి సినిమాతోనే వరుణ్ తేజ్ కు బంపర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరిని తీసుకున్నా ఫలితం మాత్రం మారలేదు.

అందుకే అఖిల్ ఈసారి రివర్స్ స్ట్రాటజీలో వెళ్తున్నాడట. హిట్ డైరెక్టర్లను కాకుండా అప్పుడెప్పుడో బొమ్మరిల్లు అనే బ్లాక్ బస్టర్ ఇచ్చిన భాస్కర్ తో చేయబోతున్నట్టు తాజా అప్ డేట్. ఇది ఇంతకు ముందే ప్రచారంలో ఉన్నప్పటికీ దాదాపు ఓకే అయ్యిందని టాక్. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. హిట్ కొట్టిన దర్శకులతో ఫ్లాపులు పడుతున్నాయి. అదే ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో చేస్తే హిట్ కొట్టోచ్చన్న రివర్స్ ప్లాన్ కావొచ్చు ఇదంతా. భాస్కర్ కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ రెడీ చేసుంటేనే తప్ప అఖిల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చుండదు. అధికారిక ప్రకటన వచ్చే దాకా ఏదీ ఖచ్చితంగా చెప్పలేం కాని చూద్దాం