Begin typing your search above and press return to search.

అఖిల్ డౌటంటున్నారే..

By:  Tupaki Desk   |   6 Oct 2015 3:30 PM GMT
అఖిల్ డౌటంటున్నారే..
X
చిన్నా పెద్దా అని తేడా లేదు. ఎప్పుడు ఏ సినిమా అయినా వాయిదా పడిపోవచ్చు. ఇంకో వారం రోజుల్లో పక్కా అనుకున్న పెద్ద సినిమాలు కూడా చాలానే వాయిదా పడ్డ సందర్భాలు బోలెడున్నాయి. ఈ సంవత్సరం తెలుగులో వచ్చిన ప్రతి పెద్ద సినిమా కూడా వాయిదా పడ్డదే అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఇప్పుడీ వాయిదాల ప్రస్తావన ఎందుకూ ఉంటే.. దసరాకు విడుదల కావాల్సిన ‘అఖిల్’ సినిమా కూడా పోస్ట్ పోన్ కావచ్చన్న ప్రచారం జరుగుతోంది టాలీవుడ్లో. కారణాలేంటన్నది పక్కా తెలియట్లేదు కానీ.. ముందు అనుకున్నట్లు ఈ నెల 22న సినిమా విడుదల కాకపోవచ్చని అంటున్నారు.

ఆడియో ఫంక్షన్ లో రిలీజ్ చేసిన ట్రైలరుకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన నేపథ్యంలో ‘అఖిల్’ సినిమాకు ఏమైనా రిపేర్లు చేస్తున్నారా అన్న డౌట్లు కొడుతున్నాయి జనాల్లో. బిజినెస్ విషయంలో ఇంతకుముందున్న ఊపు ఇప్పుడు లేదంటున్నారు. ఆడియో ఫంక్షన్ తర్వాత మళ్లీ ఇప్పటిదాకా ఏ సందడీ లేదు. అఖిల్ వెళ్లి అమెరికాలో కాస్త సందడి చేసి వచ్చాడు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ ప్రమోషన్ లేదు. రిలీజ్ డేటుకి ఇంకో 20 రోజులు కూడా టైం లేదు. ఇప్పటిదాకా ఓ రేంజిలో అఖిల్ ను ప్రమోట్ చేసి.. ఇప్పుడు సైలెంటుగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఏమైనా ఆలస్యమవుతోందా లేక ఔట్ పుట్ విషయంలో ఏమైనా తటపటాయిస్తున్నారా అన్నది తెలియడం లేదు కానీ.. సినిమా అయితే 22కు డౌట్ అన్న చర్చ అయితే నడుస్తోంది.